IND vs WI: సంజూ శాంసన్, తిలక్ వర్మ ఊచకోత.. కలిసొచ్చిన క్యాచ్ డ్రాప్!
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతన్న రెండో టీ20లో టీమిండియా 250 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. సంజూ శాంసన్, తిలక్ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 249 పరుగులు చేసింది.
సంజూ శాంసన్(41 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), శ్రేయస్ అయ్యర్(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40 ), తిలక్ వర్మ(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47 నాటౌట్) దూకుడుగా ఆడారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్(3/24) మూడు వికెట్లు తీయగా.. షమార్ స్రింగర్(1/41) ఒక వికెట్ పడగొట్టారు.

కొంపముంచిన క్యాచ్ డ్రాప్..
వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైన సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో లభించిన లైఫ్‌తో రెచ్చిపోయాడు. 6 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంజూ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌ను కవర్స్‌లో కమిలీ పూరన్ నేలపాలు చేశాడు. ఆ మరుసటి బంతినే అకీల్ హోస్సెన్ నోబాల్ వేయగా.. ఫ్రీ హిట్‌ను సంజూ సిక్సర్ బాది టచ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన జోన్‌లో పడిన ప్రతీ బంతిని బౌండరీకి తరలించాడు. అభిషేక్ శర్మ(20) వెనుదిరిగినా.. సంజూ వెనకడుగు వేయలేదు.
44 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంజూ ఇచ్చిన మరో కష్టతరమైన క్యాచ్‌ను మిడాఫ్ ఫీల్డర్ వదిలేసాడు. ఆ మరుసటి రెండు బంతులను బౌండరీకి తరలించిన సంజూ.. 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ కూడా బ్యాట్ ఝులిపించడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. హాఫ్ సెంచరీకి చేరువైన ఇషాన్ కిషన్.. రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 97 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
తిలక్ వర్మ విధ్వంసం..
క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే(7) నిరాశపర్చగా.. సెంచరీ దిశగా సాగిన సంజూ భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ దూకుడుగా ఆడారు. ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదారు. ఆఖరి ఓవర్‌లో తిలక్ వర్మ వరుసగా మూడు సిక్స్‌లు బాదగా.. శ్రేయస్ అయ్యర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆఖరి బంతిని నమన్ ధీర్ బౌండరీ బాది జట్టుకు భారీ స్కోర్ అందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

" width="200" height="113">