Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి నిరాశే.. టీమిండియాదే బ్యాటింగ్!

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఛేజింగ్‌లో తమకు మంచి రికార్డ్ ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేయడానికి స్పష్టమైన కారణం ఉంది. టీ20ల్లో ఛేజింగ్‌లో మాకు మంచి రికార్డ్ ఉంది. అంతేకాకుండా ఔట్ ఫీల్డ్ ఇప్పటికే తడిగా కనిపిస్తోంది. రాత్రి అయ్యేసరికి మంచు ప్రభావం ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది.

IND vs WI 4th T20I: ఉప్పల్ మ్యాచ్ టికెట్లు కావాలా.. అందుబాటులో 22 వేల టికెట్లు!

IND vs WI 4th T20I: ఉప్పల్ మ్యాచ్ టికెట్లు కావాలా.. అందుబాటులో 22 వేల టికెట్లు!

అందుకే ముందు బౌలింగ్‌తో భారత్‌ను కట్టడి చేసి ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేజ్ చేయాలనుకుంటున్నాం. తొలి మ్యాచ్‌లో చేసిన తప్పుల నుంచి నేర్చుకుని తిరిగొచ్చాం. జట్టులో ఒక మార్పు చేశాం.. ఫోర్డే స్థానంలో గుడకేష్ మోటీ జట్టులోకి వచ్చాడు.'అని షైహోప్ చెప్పుకొచ్చాడు.

IND vs WI 2nd T20I West Indies Opt to Bowl as India Bat First Vaibhav Sooryavanshi Misses Out

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. 'మేం టాస్ గెలిచినా ముందుగా బౌలింగే ఎంచుకునేవాళ్లం. అయితే పరిస్థితులకు తగ్గట్లు త్వరగా మారడం ముఖ్యం. వాతావరణం బాగుంది. మైదానంలో కొద్దిగా మంచు ప్రభావం ఉంది. మ్యాచ్‌లోని 40 ఓవర్ల పాటు మా ప్రమాణాలను కొనసాగించాలని చర్చించుకున్నాం. మైదానంలోకి దిగిన ప్రతిసారి మెరుగైన ప్రదర్శన చేస్తూ.. మ్యాచ్‌లు గెలవడమే మా ఏకైక లక్ష్యం. మేం సేమ్ టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

IND vs WI: సీఎస్‌కే‌లోకి వెస్టిండీస్ కెప్టెన్.. డీల్ కోసం రాంచీ మ్యాచ్‌కు ధోనీ!

Also Read

IND vs WI: సీఎస్‌కే‌లోకి వెస్టిండీస్ కెప్టెన్.. డీల్ కోసం రాంచీ మ్యాచ్‌కు ధోనీ!

తుది జట్లు:

భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మయాంక్ యాదవ్.

వెస్టిండీస్: షాయ్ హోప్ (కెప్టెన్/వికెట్ కీపర్), కమిల్ పూరన్, షిమ్రాన్ హెట్‌మైర్, రోవ్‌మన్ పవెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, గుడాకేష్ మోటీ, షామర్ స్ప్రింగర్, అకీల్ హోసేన్, షామర్ జోసెఫ్.

Story first published: Friday, October 9, 2026, 19:01 [IST]
Other articles published on Oct 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+