రజత్ పాటిదార్ ఒంటరి పోరాటం.. భారత్‌కు తప్పని పరాజయం!
సొంతగడ్డపై ఆస్ట్రేలియా-ఏతో జరిగిన అనధికారిక వన్డే సిరీస్‌ను భారత్-ఏ కోల్పోయింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా-ఏ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
శుక్రవారం జరిగిన రెండో అనధికారిక వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారత్-ఏ జట్టు 69 పరుగుల తేడాతో చిత్తయ్యింది. రజత్ పాటిదార్(82 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 67) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా-ఏ 49.5 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సామ్ కోన్‌స్టాస్(88 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 67), జోష్ ఫిలిప్(58 బంతుల్లో 8 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నాథన్ మెక్‌స్వీనీ(32) పర్వాలేదనిపించాడు.

భారత బౌలర్లలో అర్షద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్(2/46) రెండు వికెట్లు పడగొట్టాడు. విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధు, సూర్యాన్ష్ షెడ్గే, అనుకూల్ రాయ్ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్-ఏ 45.2 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. రజత్ పాటిదార్(82 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 67) ఒంటరి పోరాటం చేసినా.. ఇతర బ్యాటర్లు రాణించలేకపోయారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో రజత్ పాటిదార్‌ను న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
ఆసీస్-ఏ బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్(3/35) మూడు వికెట్లు తీయగా.. రిలే మెరిడిత్, తన్వీర్ సంఘా తలో రెండు వికెట్లు తీసారు. తొలి అనధికారిక వన్డేలో కూడా రజత్ పాటిదార్(51 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 53) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు.
2023లో సౌతాఫ్రికాపై వన్డేల్లో అరంగేట్రం చేసిన రజత పాటిదార్.. మళ్లీ అవకాశం అందుకోలేదు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీని వరుస సీజన్లలో రజత్ పాటిదార్ విజేతగా నిలబెట్టాడు. అప్పటి నుంచి అతన్ని టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నా.. సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. మరో రెండు రోజుల్లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే భారత వన్డే జట్టును సెలెక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది. రజత్ పాటిదార్‌కు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


