For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL Auction 2024: ముగిసిన వేలం.. తెలుగోడికి సీఎస్‌కే ఛాన్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) మినీ వేలానికి రంగం సిద్దమైంది. దుబాయ్‌లోని కోక కోలా అరెనా వేదికగా నేడు(మంగళవారం) ఈ కార్యక్రమం జరగనుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ వేలం షురూ కానుంది. మొత్తం 1166 మంది ప్లేయర్లు ఈ వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చగా.. పది ఫ్రాంచైజీలు 333 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశాయి.

IPL Auction 2024 Live updates and highlights in telugu:look out for the player with the highest price

10 ఫ్రాంచైజీల్లో కలిపి మొత్తం గరిష్టంగా 77 స్థానాలు ఖాళీగా ఉండగా.. ఇందులో 30 ఓవర్ సీస్ స్లాట్స్ ఉన్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలు ఈ వేలానికి సంబంధించిన ప్రణాళికలను సిద్దం చేసుకున్నాయి. మాక్ ఆక్షన్స్‌తో ప్రాక్టీస్ కూడా చేశాయి. నచ్చిన ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ సారి వేలంలో ఆక్షనీర్‌గా మల్లికా సాగర్ వ్యవహరించనుంది. ఐపీఎల్ వేలంలో ఆక్షనీర్‌గా వ్యవహరించనున్న తొలి మహిళగా ఆమె చరిత్రకెక్కనుంది.పది ఫ్రాంచైజీల్లో అత్యధికంగా గుజరాత్ టైటాన్స్ దగ్గర రూ. 38.15 కోట్ల పర్స్ మనీ ఉంది. అత్యల్పంగా లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ .13.5 కోట్లు ఉన్నాయి. ఐపీఎల్ 2024 మినీ ఆక్షన్‌కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

Dec 19, 2023, 9:53 pm IST

ఐపీఎల్ 2024 అన్‌సోల్డ్ లిస్ట్: 1.కరుణ్ నాయర్ 2.స్టీవ్ స్మిత్ 3. ఫిల్ సాల్ట్ 4. జోష్ ఇంగ్లీస్ 5. కుశాల్ మెండీస్ 6. జోష్ హజెల్ వుడ్ 7. వకార్ సల్మాకేలి 8. ఆదిల్ రషీద్ 9. అకీల్ హోస్సెన్ 10.ఇష్ సోదీ 11. టబ్రైజ్ షంసీ 12. రోహన్ కున్నుమల్ 13. ప్రియాన్ష్ ఆర్య 14. మనన్ వోహ్రా 15. సర్ఫరాజ్ ఖాన్ 16. రాజ్ ఆనంద్ భావా 17. వివ్రాంత్ శర్మ 18. అతిత్ సేత్ 19. హృతిక్ షోకీన్ 20. ఉర్విల్ పటేల్

Dec 19, 2023, 9:11 pm IST

లక్నో సూపర్ జెయింట్స్ అర్షిణి కులకర్ణి-రూ. 20 లక్షలు శివమ్ మావి-రూ. 6.40 కోట్లు ఎమ్ సిద్దార్థ్- రూ. 2.40 కోట్లు అష్టన్ టర్నర్- రూ. కోటి డేవిడ్ విల్లే- రూ. 2 కోట్లు మహమ్మద్ అర్షద్ ఖాన్- రూ.20 లక్షలు

Dec 19, 2023, 9:11 pm IST

అల్జారీ జోసెఫ్- రూ. 11.50 కోట్లు యశ్ దయాల్-రూ. 5 కోట్లు టామ్ కరణ్- రూ. 1.5 కోట్లు లాకీ ఫెర్గూసన్- రూ. 2 కోట్లు సప్నిల్ సింగ్- రూ. 20 లక్షలు

Dec 19, 2023, 9:11 pm IST

కేకేఆర్ చేతన్ సకారియా-రూ. 50 లక్షలు మిచెల్ స్టార్క్-రూ. 24.75 కోట్లు కేఎస్ భరత్-రూ. 50 లక్షలు అంగిక్రిష్ రఘు వంశీ-రూ. 20 లక్షలు షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్- రూ. 1.50 కోట్లు రమణ్‌దీప్ సింగ్-రూ. 20 లక్షలు మనీశ్ పాండే- రూ. 50 లక్షలు అట్కిన్సన్- రూ. కోటి సాకిబ్ హుస్సెన్- రూ. 20 లక్షలు

Dec 19, 2023, 9:10 pm IST

గుజరాత్ టైటాన్స్ షారూఖ్ ఖాన్-రూ. 7.40 కోట్లు ఉమేశ్ యాదవ్-రూ. 5.80 కోట్లు సుశాంత్ మిశ్రా-రూ. 2.2 కోట్లు కార్తీక్ త్యాగీ-రూ. 60 లక్షలు మానవ్ సుథార్-రూ. 20 లక్షలు స్పెన్సర్ జాన్సన్- రూ. 10 కోట్లు రాబిన్ మింజ్- రూ. 3 కోట్లు

Dec 19, 2023, 9:10 pm IST

పంజాబ్ కింగ్స్ హర్షల్ పటేల్-రూ. 11.75 కోట్లు క్రిస్ వోక్స్- రూ.4.2 కోట్లు అషుతోష్ శర్మ- రూ. 20 లక్షలు విశ్వాంత్ ప్రతాప్ సింగ్- రూ. 20 లక్షలు శశాంక్ సింగ్- రూ. 20 లక్షలు తనయ్ త్యాగరాజన్- రూ. 20 లక్షలు ప్రిన్స్ చౌధరి- రూ. 20 లక్షలు రీలీ రోసౌ- రూ. 8 కోట్లు

Dec 19, 2023, 9:10 pm IST

చెన్నై సూపర్ కింగ్స్ రచిన్ రవీంద్ర-రూ. 1.8 కోట్లు శార్దూల్ ఠాకూర్-రూ. 4 కోట్లు డారిల్ మిచెల్-రూ. 14 కోట్లు సమీర్ రిజ్వీ- రూ. 8.40 కోట్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్- రూ. 2 కోట్లు అవనీష్ అరవెల్లి- రూ. 20 లక్షలు

Dec 19, 2023, 9:09 pm IST

ముంబై ఇండియన్స్ గెరాల్డ్ కోయిట్జీ-రూ. 5 కోట్లు దిల్షాన్ మధుషంక-రూ. 4.6 కోట్లు శ్రేయస్ గోపాల్- రూ. 20 లక్షలు నువాన్ తుషార్- రూ. 4.8 కోట్లు నమాన్ ధిర్- రూ. 20 లక్షలు అన్షుల్ కంబోజ్- రూ. 20 లక్షలు మహమ్మద్ నబీ- రూ.1.50 లక్షలు శివాలిక్ శర్మ- రూ. 20 లక్షలు

Dec 19, 2023, 9:09 pm IST

ఢిల్లీ క్యాపిటల్స్ హ్యారీ బ్రూక్- రూ. 4 కోట్లు ట్రిస్టన్ స్టబ్స్-రూ. 50 లక్షలు రిక్కీ భూయ్- రూ. 20 లక్షలు కుమార్ కుశాగ్ర-రూ. 7.20 కోట్లు రషిక్ దార్- రూ. 20 లక్షలు జై రిచర్డ్‌సన్- రూ. 5 కోట్లు సుమిత్ కుమార్- రూ. కోటి షై హోప్- రూ. 75 లక్షలు స్వస్తిక్ చికారా- రూ. 20 లక్షలు

Dec 19, 2023, 9:09 pm IST

రాజస్థాన్ రాయల్స్ రోవ్‌మన్ పోవెల్- రూ. 7.4 కోట్లు శుభమ్ దూబే- రూ.5.80 కోట్లు నాండ్రి బర్గర్- రూ. 50 లక్షలు అబిద్ ముస్తాక్- రూ. 20 లక్షలు

Dec 19, 2023, 9:05 pm IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు

ట్రావిస్ హెడ్- రూ. 6.80 కోట్లు వానిందు హసరంగా- రూ. 1.5 కోట్లు ప్యాట్ కమిన్స్- రూ. 20.50 కోటలు జయదేవ్ ఉనాద్కత్-రూ. 1.60 కోట్లు ఆకాశ్ సింగ్- రూ. 20 లక్షలు జాథవెద్ సుబ్రమణ్యన్- రూ. 20 లక్షలు

Dec 19, 2023, 9:04 pm IST

తెలుగు ప్లేయర్ అవనీష్ రావుకు సీఎస్‌కే చాన్స్

రూ. 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసిన సీఎస్‌కే

Dec 19, 2023, 6:45 pm IST

బేసిక్ ప్రైజ్ రూ.20 లక్షలతో వచ్చిన సిద్ధార్థ్ మణిమరన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ.2.4 కోట్లు ఖర్చుపెట్టింది.

Dec 19, 2023, 6:43 pm IST

సుశాంత్ మిశ్రాను రూ.2 కోట్లకు, పేసర్ కార్తిక్‌ త్యాగీని రూ.60 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.

Dec 19, 2023, 6:42 pm IST

యంగ్ ప్లేయర్ యశ్ దయాల్‌ను బెంగళూరు రూ.5 కోట్లకు దక్కించుకుంది.

Dec 19, 2023, 6:39 pm IST

వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.7.20 కోట్లకు కొనుగోలు చేసింది.

Dec 19, 2023, 6:37 pm IST

హిట్టర్‌ షారుఖ్‌ ఖాన్‌ రూ. 7.4 కోట్ల ధర పలికాడు. అతడిని గుజరాత్ దక్కించుకుంది.

Dec 19, 2023, 6:36 pm IST

రూ. 20 లక్షల బేసిక్ ప్రైజ్‌తో వచ్చిన శుభమ్ దూబె కోసం రాజస్థాన్ రాయల్స్ రూ. 5.8 కోట్లు కుమ్మరించింది.

Dec 19, 2023, 6:35 pm IST

వేలంలో భారీ ధర పలుకుతున్న అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్. సమీర్ రిజ్వి కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ.8.4 కోట్లు వెచ్చించింది.

Dec 19, 2023, 4:51 pm IST

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించడం చాలా సంతోషంగా ఉంది. జట్టు విజయం కోసం కృషి చేస్తా: ప్యాట్ కమ్మిన్స్

Dec 19, 2023, 4:48 pm IST

ప్యాట్ కమ్మిన్స్‌కు కలిసొచ్చిన 2023. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ టైటిల్‌కు కెప్టెన్ కాగా,యాషెస్ సిరీస్‌ నిలబెట్టుకోవడంలో కూడా జట్టును ముందుండి నడిపించాడు.ప్రపంచకప్ ఇతని సారథ్యంలోనే ఆస్ట్రేలియా నెగ్గింది.ఇక చివరిగా ఐపీఎల్‌లో అధిక ధర ప్యాట్ కమ్మిన్స్‌కు పలికింది

Dec 19, 2023, 3:58 pm IST

స్టార్క్, కమ్మిన్స్ ఇద్దరూ అత్యంత విలువైన ఆటగాళ్లుగా అభివర్ణిస్తూ వారి ఫోటోను ట్వీట్ చేసిన సన్‌రైజర్స్ యాజమాన్యం

Dec 19, 2023, 3:56 pm IST

రూ.1.60 కోట్లకు జయదేవ్ ఉనద్కత్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

Dec 19, 2023, 3:50 pm IST

మిచెల్ స్టార్క్‌ను రూ.24.75 కోట్ల రికార్డు స్థాయి ధరతో కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

Dec 19, 2023, 3:41 pm IST

శివం మావిని రూ.6.80కోట్లకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జైంట్స్

Dec 19, 2023, 3:37 pm IST

మిచెల్ స్టార్క్‌ కోసం పోటీ పడుతోన్న ముంబై,గుజరాత్,కోల్‌కతా జట్లు

Dec 19, 2023, 3:36 pm IST

తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

Dec 19, 2023, 3:12 pm IST

డారిల్ మిచెల్‌ను రూ.14 కోట్లకు దక్కించుకున్న చెన్నై సూపపర్ కింగ్స్

Dec 19, 2023, 2:59 pm IST

ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌ను రూ.4.20 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Dec 19, 2023, 2:17 pm IST

ప్యాట్ కమ్మిన్స్‌ను రూ20.50 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన హైదరాబాద్ జట్టు

Dec 19, 2023, 2:00 pm IST

రచిన్ రవీంద్రను రూ.1.80 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్

Dec 19, 2023, 1:41 pm IST

ఐపీఎల్‌లో అమ్ముడుపోని మనీష్ పాండే

Dec 19, 2023, 1:41 pm IST

తొలిరౌండ్‌లో అమ్ముడుపోని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్

Dec 19, 2023, 1:39 pm IST

వేలంపాటలో అమ్ముడుపోని కరుణ్ నాయర్

Dec 19, 2023, 1:37 pm IST
Mykhel

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్‌‌ను రూ.6కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

Dec 19, 2023, 1:33 pm IST
Mykhel

హ్యారీ బ్రూక్‌ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

Dec 19, 2023, 1:31 pm IST

ట్రావిస్ హెడ్ కోసం పోటీ పడుతోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్

Dec 19, 2023, 1:26 pm IST

దక్షిణాఫ్రికా ప్లేయర్ రొసొవ్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.

Dec 19, 2023, 1:23 pm IST

వెస్టిండీస్ బ్యాటర్ రోవ్‌మెన్ పావెల్ కోసం రాజస్థాన్, కోల్‌కతా పోటాపోటీపడ్డాయి. కనీస ధర రూ.కోటిగా బరిలోకి దిగిన పావెల్‌ను రూ.7.40 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.

Dec 19, 2023, 1:18 pm IST

ఐపీఎల్ వేలం చరిత్రలో అరుదైన ఘట్టం

Dec 19, 2023, 1:14 pm IST

దుబాయ్‌లోని కోకాకోలా అరీనా వేదికగా ఐపీఎల్ వేలం ప్రారంభమైంది.

Dec 19, 2023, 12:29 pm IST

తన కోసం ఫ్రాంచైజీలు పోటాపోటీ పడుతుంటే.. రూ.కోట్లు వద్దు ధోనీ చాలంటూ కొయెట్జీ సంచలన ప్రకటన

Dec 19, 2023, 12:05 pm IST

కొత్త రూల్

ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌ నుంచి కొత్త రూల్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. బ్యాట్-బాల్‌ మధ్య పోటీని పెంచడానికి ఒకే ఓవర్‌లో రెండు బౌన్సర్లలను అనుమతించనున్నారు.

Dec 19, 2023, 11:37 am IST

వేలంలో దిల్లీ క్యాపిటల్స్ తరపున రిషభ్ పంత్ పాల్గొనున్నాడు. ఆక్షన్‌‌లో పాల్గొనడం పంత్‌కు ఇదే తొలిసారి.

Dec 19, 2023, 9:19 am IST

బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్,కామెరూన్ గ్రీన్,రజత్ పటిదార్ ఉంటారని కన్ఫామ్ చేసిన హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్

Dec 19, 2023, 7:57 am IST

ఆక్షనీర్‌గా మహిళ

Mykhel

ఐపీఎల్ వేలంపాటలో ఆక్షనీర్‌గా మహిళ. మల్లికా సాగర్‌ ఈసారి వేలంపాట నిర్వహించి చరిత్ర సృష్టించనున్నారు

Dec 19, 2023, 7:55 am IST

సురేష్ రైనా హాట్ కామెంట్స్

Mykhel

"ఐపీఎల్ బిడ్డింగ్ వ్యూహం గురించి నన్నడిగితే.. ప్రతి ఒక్క ఆటగాడు అమ్ముడుపోవాలనే నేను కోరుకుంటాను. నాలా ఎవరూ అమ్ముడుపోకుండా ఉండకూడదు"- సురేష్ రైనా

Dec 19, 2023, 7:46 am IST

రికీ పాంటింగ్ కామెంట్స్

Mykhel

రోహిత్ శర్మ నా ఫేవరెట్ ఆటగాడు. తాను ఆడే పుల్ అండ్ హుక్ షాట్స్‌కు నేను ఫిదా అయ్యాను - ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్

Dec 19, 2023, 7:40 am IST
Mykhel

వేలంపాటకు సిద్ధమైన పంజాబ్,ముంబై ఫ్రాంఛైజీ ఓనర్లు ప్రీతి జింతా, నీతా అంబానీ

Dec 19, 2023, 7:29 am IST

దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానున్న ఐపీఎల్ ఆక్షన్ 2024

Dec 19, 2023, 7:26 am IST

ఐపీఎల్‌కు సంబంధించి వేలంపాట విదేశాల్లో జరగడం ఇదే తొలిసారి

Dec 19, 2023, 7:25 am IST

ఐపీఎల్ 2024 మినీ వేలంపాటకు వేదికగా నిలవనున్న దుబాయ్

Dec 19, 2023, 7:24 am IST

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ మినీవేలంపాట ప్రారంభం

Story first published: Tuesday, December 19, 2023, 7:21 [IST]
Other articles published on Dec 19, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+