India vs Pakistan: యశస్వీ అజేయ సెంచరీ.. పాక్‌పై భారత్ సూపర్ విక్టరీ

పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : అండర్-19 ప్రపంచకప్ ముద్దాడేందుకు యువ భారత్ ఒక్క అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొందిన ప్రియమ్ గార్గ్ నేతృత్వంలోని యంగ్ ఇండియా సగర్వంగా ఫైనల్‌కు చేరింది.
యశస్వీ జైస్వాల్(113 బంత్లులో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 105 నాటౌట్) సూపర్ సెంచరీకి తోడు.. దివ్యాన్ష్ సక్సెనా (99 బంతుల్లో 6 ఫోర్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీతో చేలరేగడంతో దాయదీ పాక్ చిత్తయింది. ఫలితంగా అండర్-19 ప్రపంచకప్ నాకౌట్ చరిత్రలో 10 వికెట్లతో నెగ్గిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా వరుసగా మూడో సారి ఫైనల్‌కు చేరింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 43.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్ హైదర్ అలీ(56), కెప్టెన్ నజీర్(62), మహ్మద్ హారీస్(21) మినహా మిగతా బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో సుశాంత్ మిశ్రా(3/28) మూడు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అథర్వ అంకోలేకర్, యశస్వీ జైస్వాల్‌కు చెరో వికెట్ దక్కింది. అనంతరం 173 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 35.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 176 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.

ఆడుతూ.. పాడుతూ..
173 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు యశస్వీ, సక్సెనా నిదానంగా ఆడుతూ పాడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. రెండో ఓవర్ రెండో బంతిని ఫోర్ కొట్టి జైస్వాల్ బౌండరీల ఖాతా తెరవగా.. 9 ఓవర్ మూడో బంతికి సక్సెనా బౌండరీ కొట్టాడు. క్రీజులో కుదురుకోవడానికి నిదానంగా ఆడిన ఈ జోడి ఆరో ఓవర్ మెయిడిన్ కూడా చేసింది. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది.

బౌలర్ల సహనానికి పరీక్షగా..
ఆచితూచి ఆడిన ఈ జోడీ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచింది. వికెట్ల మధ్య పరిగెడుతూ సింగిల్స్‌తో స్కోర్ తగ్గకుండా జాగ్రత్త పడింది. మంచి బంతులను గౌరవిస్తూ చెడ్డ బంతులను బౌండరీకి తరలిచింది. ఖాసీమ్ అక్రమ్ వేసిన 14వ ఓవర్లలో జైస్వాల్ రెండు ఫోర్లతో వేగం పెంచాడు. ఇక 18 ఓవర్ తొలి బంతిని జైస్వాల్ డీప్ మిడ్ వికెట్ మీదుగా కొట్టిన సిక్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్. మరోవైపు సక్సెనా నిదానంగా ఆడుతున్నా జైస్వాల్ మాత్రం దూకుడును కొనసాగించాడు.
India Vs New Zealand 1st ODI ప్రివ్యూ.. ఇద్దరు ఓపెనర్ల అరంగేట్రం.. భారత తుది జట్టు ఇదే?!!

బౌండరీలతో హాఫ్ సెంచరీలు..
ఈ క్రమంలో 22 ఓవర్ తొలి బంతిని, మూడో బంతిని బౌండరీకి తరలించిన జైస్వాల్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత కొద్ది సేపటికీ సక్సెనా కూడా అబ్బాస్ అఫ్రిదీ వేసిన 29 ఓవర్ తొలి బంతిని బౌండరీతో 80 బంతుల్లో అర్థం శతకం సాధించాడు.
ఆయనే నా విన్నర్.. క్రేజీ క్రికెటర్‌పై మనసు పడ్డ దిశా పటానీ

వరుస సిక్స్‌లు..
హాఫ్ సెంచరీ అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ అబ్బాస్ అఫ్రిదీ వేసిన 31 ఓవర్‌ను చీల్చిచిండాడారు. తొలుత జైస్వాల్ వరుసగా రెండు సిక్స్‌లు బాదగా.. సక్సెనా ఫోర్ కొట్టి మొత్తం 15 పరుగులు పిండుకున్నారు.
మయంతి .. స్టువర్ట్ బిన్నీ నీ బ్యాగ్‌లు మోస్తున్నాడా? దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన టీవీ హోస్ట్

విన్నింగ్ షాట్‌తో సెంచరీ..
భారత విజయానికి 15 ఓవర్లలో 5 పరుగులు చేయాల్సి ఉండగా.. జైస్వాల్ 99 పరుగులతో సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. ఇక స్ట్రైకింగ్‌లో సక్సెనా ఉండగా.. పాక్ బౌలర్ ఆమిర్ అలీ వైడ్ వేశాడు. అయితే సక్సెనా పరుగు తీయడంతో జైస్వాల్ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. ఆమిర్ వేసిన మూడో బంతిని డిప్ మీడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచిన అతను విజయంతో పాటు సెంచరీ అందుకున్నాడు. ఇక జైస్వాల్‌కు ఇది తొలి ప్రపంచకప్ సెంచరీ కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications