మయంతి .. స్టువర్ట్ బిన్నీ నీ బ్యాగ్‌లు మోస్తున్నాడా? దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన టీవీ హోస్ట్

హైదరాబాద్: టీవీ యాంకర్ కోసం మ్యాచ్‌లు చూస్తారా? అంటే ఈ ప్రశ్నకు సమాధానంగా 'మయంతి లాంగర్' పేరు చెప్పుకోవాలి. ఆకట్టుకునే రూపంతో, తనదైన శైలిలో క్రికెట్ వ్యాఖ్యానం చేసే ఈ బ్యూటీ వ్యాఖ్యాతగా క్రేజీ పాపులారిటీ సంపాదించుకుంది.
స్పోర్ట్స్ ప్రజెంటర్, స్టార్ స్పోర్ట్స్ యాంకర్‌గా ప్రీ , పోస్ట్ మ్యాచ్ షోలో తనదైన యాంకరింగ్‌తో ఓ రివల్యూషన్ తీసుకొచ్చింది. మైదానంలో మైక్ పట్టుకొని సీనియర్ క్రికెటర్లతో ఆమె చేసే హడావుడి అంత ఇంతకాదు.
క్రికెట్ అభిమానులకు మయంతి అందం, అభినయం సుపరిచితమే. టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ సతీమణి అని, రోజర్ బిన్నీ కోడలన్న విషయం కూడా తెలిసిందే. అప్పుడెప్పుడో 2016లో భారత్ తరఫున వన్డే ఆడిన బిన్నీ మళ్లీ అవకాశం దక్కించుకోలేదు. ఐపీఎల్, డొమెస్టిక్ సీజన్‌లలో ఆడుతున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ఓ అభిమాని మయంతిని గేలి చేసే ప్రయత్నం చేశాడు. దీనికి మయంతి కూడా తనదైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
ఇంతకేం జరిగిందంటే..
స్టూడియోలో దిగిన ఓ ఫొటోకు మయాంతి..‘ఇది మా స్టూడియోలోని రంగుల జీవితం'అనే క్యాప్షన్‌కు ఓ ఎమోజీని పెట్టి ట్వీట్ చేసింది. దీనికి ఓఅభిమాని స్టువర్ట్ బిన్నీ ఎక్కడా? అని ప్రశ్నిస్తూ కామెంట్ చేశాడు. దీనికి మరో అభిమాని అతను మయాంతి బ్యాగులు మోస్తూ సహాయం చేస్తున్నాడని మరో అభిమాని వెటకారంగా కామెంట్ చేశాడు. దీనికి తీవ్ర ఆగ్రహానికి గురైన మయాంతి తనదైన శైలిలో బదులిచ్చి ఆ అభిమాని నోరు మూయించింది.
అతని మరణం నా ఆలోచనా దృక్పథాన్ని మార్చింది: కోహ్లీ
నీలా తెలియనోళ్ల మీద కామెంట్స్ చేయడు..
‘నా బ్యాగ్‌లు నేను మోసుకోగలను. చాలా కృతజ్ఞతలు. అతను క్రికెట్ ఆడుతూ తన జీవితం గడపడంలో బిజీగా ఉన్నాడు. అయితే మీలా తెలియనోళ్లపై అతను కామెంట్స్ చేయకపోవడం నిజంగా అద్భుతమే'అని సెటైరిక్‌గా దిమ్మతిరిగే బదులిచ్చింది. ఇక మాయంతి రిప్లేకు ముగ్ధులైన అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నీ సమయస్పూర్తికి సలాం' అంటూ కొనియాడుతున్నారు.

ఫిఫా కప్‌తో తొలిసారిగా..
1985 ఫిబ్రవరి 8న ఢిల్లీలో జన్మించిన మయంతి స్థానిక హిందూ కాలేజీలో గ్యాడ్యూయేషన్ పూర్తి చేసింది. కాలేజీలో నిర్వహించే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించేది. దీంతో పీజీ చేస్తుండగానే జీ స్పోర్ట్స్‌లో యాంకర్‌గా అవకాశం వచ్చింది. తన పెర్ ఫార్మెన్స్ చాలా మందికి నచ్చడంతో ఆమె కెరీర్ తారా జువ్వలా దూసుకుపోయింది. 2010లో ఫిఫా ప్రపంచకప్‌కి తొలిసారి వాఖ్యాతగా వ్యవహరించింది. అక్కడ విజయవంతం కావడంతో 2010లో ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ క్రీడలకు టీవీ ప్రెజెంటర్‌గా చేసింది. ఇక అప్పటినుంచి ఐపీఎల్, ప్రపంచకప్‌లకు వ్యాఖ్యాతగా కొనసాగుతోంది. ఐపీఎల్‌లో బెస్ట్ యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకుంది.

ఆమె కోసమే..
మ్యాచ్‌కు ముందు జరిగే విశ్లేషణలను చాలా మంది మయంతి కోసమే చూస్తారంటే అతిశయోక్తి కాదు. 2013లో క్రికెటర్ స్టువార్ట్ బిన్నిని వివాహం చేసుకున్న ఆమె.. వస్త్రధారణ విషయంలో ట్రోలింగ్ గురువతూంటుంది. ఇక స్టువర్ట్ బిన్నీ వ్యవహారంతో కూడా అభిమానులు గేలిచేసే ప్రయత్నం చేస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications