Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చైనా స్పాన్సర్లతో ఐఓఏ కటీఫ్.. కుదరదన్న బీసీసీఐ!

 BCCI Treasurer Arun Dhumal Says Chinese Sponsorship In IPL Helping Indian Economy

న్యూఢిల్లీ: సరిహద్దులో డ్రాగన్ కంట్రీ చైనా దాష్టీకానికి నిరసనగా దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి సంబంధించిన ఉత్పత్తులను, మొబైల్ యాప్‌లను బహిష్కరించాలని యావత్ భారతం ముక్తకంఠంగా పిలుపునిస్తుంది. ఈ నేపథ్యంలో చైనీస్ ప్రోడక్ట్స్, స్పాన్సర్లను బాయ్‌కాట్ చేసేందుకు సిద్దంగా ఉన్నామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) ప్రకటించింది. కానీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం ప్రజల భావోద్వేగాలతో చైనా కంపెనీల ఒప్పందాలపై నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. ఇండో-చైనా బార్డర్ గల్వాన్ వ్యాలీలో ఇరుదేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అందులో మన తెలుగు ముద్దు బిడ్డ, తెలంగాణవాసి కల్నల్ సంతోష్‌బాబు కూడా మాతృభూమి కోసం నేలకొరిగాడు.

 ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాం..

ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాం..

ఈ చైనా దాష్టికానికి బుద్ది చెప్పాలని భారత ప్రజలు భావిస్తున్న నేపథ్యంతో చైనీస్ స్పోర్ట్స్ పరికరాల ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహ్తా గురువారం స్పష్టం చేశారు. ‘మా కిట్ స్పాన్సర్ లీనింగ్‌తో టోక్యో ఒలింపిక్స్ వరకూ అగ్రిమెంట్ ఉంది. అయితే మాకు దేశమే ముఖ్యం. ఒకవేళ లీనింగ్‌తో ఒప్పందం రద్దు చేసుకోవాలని సభ్యులు భావిస్తే.. జనరల్ హౌజ్ నిర్ణయం తీసుకుంటుంది.'అని తెలిపారు.

భారతీయులపై మండిపడిన పోర్న్‌ స్టార్‌గా మహిళా రేసర్‌!

 చైనా కంపెనీల వల్ల మనకే లాభం..

చైనా కంపెనీల వల్ల మనకే లాభం..

ఇక భారత క్రికెట్‌కు బంగారు బాతులాంటి ఐపీఎల్‌ను చైనా కంపెనీ అయిన వివో స్పాన్సర్‌షిప్‌ చేస్తోంది. మరోవైపు టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా ఇటీవలి వరకు మరో చైనా కంపెనీ ‘ఒప్పో' వ్యవహరించగా... ఇప్పుడున్న బైజూస్‌లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలతో అనుబంధం కొనసాగించడంపై వస్తున్న ప్రశ్నలకు బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ సమాధానమిచ్చారు. ‘వివో' వల్లే మనకే లాభం తప్ప చైనాకు కాదని ఆయన స్పష్టం చేశారు.

అందుకే కెప్టెన్‌గా సచిన్ విఫలమయ్యాడు: భారత మాజీ కోచ్

భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోదు..

భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోదు..

బోర్డు భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోదని, వాస్తవాలు చూడాలని ఆయన అన్నారు. ‘ఇప్పుడంతా భావోద్వేగంతో స్పందిస్తున్నారు. దీన్ని పక్కనబెట్టి యథార్థంగా ఆలోచించండి. చైనా కంపెనీలకు మద్దతు ఇస్తున్నామా లేక అక్కడి నుంచి రాబడి అందుకుంటున్నామా అనే తేడా తెలుస్తుంది. చైనా కంపెనీల ఉత్పత్తుల్ని భారత్‌లో విక్రయించేందుకు అనుమతిస్తే మన వినియోగంతో వారికి డబ్బు వెళ్తుంది.

రూ. 440 కోట్లు చెల్లిస్తుంది..

రూ. 440 కోట్లు చెల్లిస్తుంది..

అదే చైనా కంపెనీ వారి బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం మనకు చెల్లిస్తే అక్కడి నుంచి రాబడి వస్తుంది.అంటే భారత ఆర్థిక రంగానికి ఇది లాభించేది! ఎలాగంటే టైటిల్‌ స్పాన్సర్‌ కోసం వివో కంపెనీ బీసీసీఐకి సాలీనా రూ. 440 కోట్లు చెల్లిస్తుంది. ఇందులో 42 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. అంటే ఇది ఆర్థికంగా మనకు మేలు చేసే అంశమే' అని వివరించారు. ఒక వేళ మనం వద్దనుకుంటే ఆ మొత్తం చైనాకు తరలిపోతుందన్నారు.

భారత ఆటగాళ్ల జంబలకిడిపంబ.. రోహితా మస్త్ ఉన్నవ్: చహల్

Story first published: Friday, June 19, 2020, 13:20 [IST]
Other articles published on Jun 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+