For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే కెప్టెన్‌గా సచిన్ విఫలమయ్యాడు: భారత మాజీ కోచ్

Former India coach Madan Lal reveals why Sachin Tendulkar struggled as captain

న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్.. క్రికెట్ దేవుడు.! పరుగుల రారాజు.! 100 సెంచరీల మొనగాడు.! అత్యధిక పరుగుల వీరుడు.! మైదానంలో తిరుగులేని శక్తిగా.. ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రంగా నిలిచిన యోధుడు.! ఇలా చెప్పుకుంటూ పోతే 24 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో సచిన్ సృష్టించిన రికార్డులెన్నో.. అధిగమించిన ఘనతలు మరెన్నో.! బ్యాట్స్‌మన్‌గా ఇంత సక్సెస్‌ అయిన సచిన్.. కెప్టెన్‌గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. కఠినమైన బౌలర్లను తన బ్యాట్‌తో చీల్చిచెండాడిన మాస్టర్.. సారథ్య ఒత్తిడిని మోయలేకపోయాడు.

 ఘోరంగా విఫలం..

ఘోరంగా విఫలం..

1996 ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక మ్యాచ్‌ గల బోర్డర్ గావస్కర్ సిరీస్‌తో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న సచిన్.. 73 వన్డేలు, 25 టెస్టుల్లో జట్టును నడిపించాడు. కానీ జట్టుకు మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలన్నందించలేకపోయాడు. అతని సారథ్యంలో భారత్ 23 వన్డేలు, 4 టెస్ట్‌లు మాత్రమే గెలవడం గమనార్హం. వ్యక్తిగతంగా రాణించినా.. జట్టుగా విఫలమయ్యాడు. ఈ దారుణ వైఫ్యంతో చెప్పపెట్టకుండా సచిన్‌ను సారథిగా తప్పించడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన అతను ఒకానొక దశలో క్రికెట్‌ను వదిలియాలనుకున్నాడు. కానీ కుటుంబ సభ్యుల సహకారంతో ఆటగాడిగా కొనసాగాడు. ఆ తర్వాత కెప్టెన్సీ చేసే అవకాశాలు వచ్చినా సచిన్ ఆసక్తి చూపలేదు. కెప్టెన్‌గా అతని వైఫల్యం ఇప్పటికీ మిస్టరే.

 నేను ఒప్పుకోను..

నేను ఒప్పుకోను..

అయితే సచిన్ కెప్టెన్‌‌గా విఫలమయ్యాడంటే తాను ఒప్పుకోనని మాజీ క్రికెటర్, కోచ్ మదన్‌లాల్ అన్నాడు. తాజాగా ఫేస్‌బుక్ వేదికగా ‘స్పోర్ట్స్ కీడా'నిర్వహించిన లైవ్ సెషన్‌లో పాల్గొన్న మదన్‌లాల్.. కెప్టెన్‌గా మాస్టర్ వైఫల్యం చెందడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు. సచిన్ ఒక్కడే రాణించడం.. ఇతర ఆటగాళ్లు విఫలమవ్వడంతో సారథిగా విజయాలు అందించలేకపోయాడని, అంతే తప్ప సచిన్‌కు కెప్టెన్సీ సామర్థ్యం లేక కాదని స్పష్టం చేశాడు.

 ఒక్కడే ఆడితే విజయం దక్కదు..

ఒక్కడే ఆడితే విజయం దక్కదు..

‘సచిన్ గొప్ప సారథి కాదంటే నేనేమాత్రం అంగీకరించను. బాధ్యత గల కెప్టెన్‌గా వ్యక్తిగతంగా రాణించడంపైనే సచిన్ దృష్టిపెట్టాడు. దీంతో జట్టును కేర్‌ తీసుకోవడం కష్టమైంది. కెప్టెన్ ఒక్కడే రాణిస్తే విజయాలు దక్కవు. ఇతర పది మంది ఆటగాళ్లు కూడా బాధ్యతాయుతంగా ఆడాలి. దీన్ని సమన్వయం చేయడం కొంచెం కష్టమే. 'అని సచిన్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో భారత జట్టు కోచ్‌గా పనిచేసిన మదన్ లాల్ (1996-97) చెప్పుకొచ్చాడు.

 కొన్ని సార్లు అంతే..

కొన్ని సార్లు అంతే..

గేమ్‌పై సచిన్‌కు గొప్ప అవగాహన ఉందని మదన్ లాల్ తెలిపాడు. ‘సచిన్‌ గేమ్‌ను బాగా అర్థం చేసుకుంటాడు. ఆటగాళ్లు ఎక్కడ తప్పు చేస్తున్నారే విషయాన్ని ఇట్టే కనిపెట్టేస్తారు. ఏ పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్, బౌలింగ్ చేయాలో కూడా చెబుతాడు. ఈ విషయాలన్నిటిలో సచిన్‌కు మంచి పట్టుంది. కానీ కొన్ని సార్లు ఎంత ప్రయత్నించినా ఫలితం మనకు అనుకూలంగా ఉండదు. సచిన్ విషయంలోనూ ఇదే జరిగింది. అంతే తప్పా సచిన్‌కు కెప్టెన్సీ సామర్థ్యం లేక కాదు'అని మదన్ లాల్ చెప్పుకొచ్చాడు. భారత్ గెలిచిన 1983 ప్రపంచకప్ జట్టులో సభ్యుడైన మదన్‌లాల్.. 1974-87 మధ్య సాగిన తన కెరీర్‌లో మొత్తం 39 టెస్ట్‌లు.. 67 వన్డేలు ఆడాడు.

క్రికెట్‌లో మరో కొత్త ఫార్మాట్.. మూడు జట్లతో 36 ఓవర్ల మ్యాచ్!

Story first published: Thursday, June 18, 2020, 13:20 [IST]
Other articles published on Jun 18, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+