Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత ఆటగాళ్ల జంబలకిడిపంబ.. రోహితా మస్త్ ఉన్నవ్: చహల్

Yuzvendra Chahal trolls ‘Rohita Sharmaa’ in hilarious post
Yuzvendra Chahal ట్రోల్స్ Rohit Sharma With A ఫన్నీ పోస్ట్

న్యూఢిల్లీ: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఎంత సరదా వ్యక్తో అందరికి తెలిసిందే. మైదానంలో అతను చేసే అల్లరి పనులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంటాయి. అతని చిలిపి చేష్టలకు ముగ్దుడైన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకంగా చహల్ ఓ టీమిండియా కమెడియన్ అని బిరుదే ఇచ్చాడు. మాములుగానే కోతిపనులు చేసే చహల్‌కు లాక్‌డౌన్‌తో మరింత స్వేచ్చ దొరికింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రతీ క్రికెటర్‌ను గెలుకుతూ.. వారితో చివాట్లు తింటూ.. మందలింపుకు గురవుతున్నాడు.

ఎవరెన్నీ తిట్టినా ఏ మాత్రం పట్టించుకొని ఈ స్పిన్నర్.. తన పంథానైతే మార్చుకోవడం లేదు. ఆ మధ్య విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ గేల్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గట్టిగా వార్నింగ్ ఇచ్చినా.. తన కోతి వేశాలు మాత్రం ఆపడం లేదు. ఇక యువరాజ్-రోహిత్ లైవ్ సెషన్‌లో దూరి సిక్సర్లసింగ్‌ను ఇరకాటంలో పడేశాడు. పోలీస్ కేసులు.. క్షమాపణలు చెప్పెంత వరకు కొనసాగిన దుమారానికి కారణమయ్యాడు.

రోహితా.. సో క్యూట్

తాజాగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. ఫేస్ మార్ఫింగ్ యాప్ సాయంతో రోహిత్ ఫొటోను అమ్మాయిలా మార్చి.. ట్వీట్ చేశాడు. మేల్, ఫిమేల్ వర్షన్ ఫొటోలను పక్కపక్కనే పెట్టి షేర్ చేశాడు. దీనికి ‘రోహితా చూడటానికి చాలా అందంగా ఉన్నావు. లవ్‌యూ'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఇక ఈ ట్వీట్‌కు అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. రోహిత్ అమ్మాయిగా బాగున్నాడని కామెంట్ చేస్తున్నారు.

అందుకే కెప్టెన్‌గా సచిన్ విఫలమయ్యాడు: భారత మాజీ కోచ్

పెళ్లి చేసుకుందువా చహల్

ఇక రోహిత్ అమ్మాయి అయితే చహల్ పెళ్లి చేసుకునేవాడేమోనని ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు. ఇంకొందరేమో.. చహల్ అమ్మాయి వర్షన్ ఫొటోలను షేర్ చేస్తూ.. నువ్వు ఇంకా సెక్సీగా ఉన్న చహల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘రోహిత్ చూస్తే నీకుంటుంది చహల్.. నిన్ను పిచ్చకొట్టుడు కొడుతాడు సుమా'అంటూ హెచ్చరిస్తున్నారు. అంతకాకుండా వెనక్కు నుంచి రోహిత్ తన్నినట్లున్న మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ‘ఏంది వ్యా చహల్ ఇది'అనే ఎక్స్‌ప్రెషన్ ఏమోజీలను కూడా ట్వీట్ చేస్తున్నారు.

అమ్మాయిలుగా భారత ఆటగాళ్లు..

ఇక మరికొంతమంది ఔత్సాహికులు ‘జంబలకిడిపంబ' సినిమాలో మాదిరి భారత ఆటగాళ్లందరిని అమ్మాయిలుగా మార్చి ట్వీట్ చేస్తున్నారు. ఏ మాత్రం గుర్తు పట్టకుండా అచ్చం అమ్మాయిలు అయితే ఎలా ఉంటారో అలా అందంగా ఉండేలా వారి యాప్స్ నైపుణ్యానికి పనిపెడ్తున్నారు. ప్రస్తుతం ఈ భారత ఆటగాళ్ల జంబలకిడిపంబ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ధోనీ, కోహ్లీ, భువనేశ్వర్, పాండ్యా, రోహిత్ , రాహుల్ ఏమాత్రం గుర్తు పట్టలేకుండా అందంగా ఉన్నారు.

అవన్నీ తప్పుడు వార్తలే.. నేను బాగానే ఉన్నా: అఫ్రిది

Story first published: Thursday, June 18, 2020, 16:09 [IST]
Other articles published on Jun 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+