భారతీయులపై మండిపడిన పోర్న్ స్టార్‌గా మారిన మహిళా రేసర్!

సిడ్నీ: ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు బతుకుదెరువు కోసం పోర్న్ స్టార్‌గా మారిన ఆస్ట్రేలియా మహిళా రేసర్ రెనీ గ్రేసీ.. భారత నెటిజన్లపై మండిపడింది. తన అనుమతి లేకుండా తన ఫొటోలను, ఇతరత్రా వివరాలను దొంగిలించి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారని ఓ పోస్టులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
'అది కాపీరైట్ ఉన్న కంటెంట్. వాటిపై నాకే సర్వహక్కులున్నాయి. నా మీద సోషల్ మీడియాలో పేజీలు క్రియేట్ చేయడం ఆపండి. వీడియోలు, ఫొటోలను చట్ట వ్యతిరేకంగా షేర్ చేయడం మానండి. భారతీయులను నేను ఇష్టపడడం లేదు. నా పేజీ నుంచి వెళ్లిపోండి. మీకు ఎవరూ ఆహ్వానం పలకడం లేదు. మిమ్మల్నందరినీ నా పేజీ నుంచి తొలగిస్తున్నా.' అని 25 ఏళ్ల గ్రేసర్ నిప్పులు చెరిగింది.

బతుకుదెరువు కోసం..
14వ ఏట నుంచి రేసర్‌గా కొనసాగుతున్న రెనీ.. ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు రేసింగ్ వదలి పోర్న్ స్టార్‌గా మారానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే. 1998 నుంచి పూర్తి స్థాయి తొలి మహిళా సూపర్ కార్స్ రేసర్‌గానూ పేరు తెచ్చుకున్న ఈ ఆస్ట్రేలియా రేసర్‌కు 2017 నుంచి కష్టాలు మొదలయ్యాయి. రేసింగ్‌లో తన ప్రదర్శన దిగజారడంతో పాటు ఆర్థికంగా తోడ్పాటు కూడా లేకపోవడంతో ఆమె కెరీర్‌ను వదులుకోవాల్సి వచ్చింది. బతుకుదెరువు కోసం ఓ కారు యార్డులో పనిచేసిన ఆమె.. పరిస్థితులు అనుకూలించక చివరకు పోర్న్ స్టార్‌గా మారింది. ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చనే ఉద్దేశంతోనే అడల్ట్ స్టార్‌గా మారినని తెలిపింది.
2011 ప్రపంచకప్‌ను అమ్ముకున్నాం.. శ్రీలంక మాజీ క్రీడామంత్రి సంచలన వ్యాఖ్యలు

అడల్ట్ వెబ్‌సైట్ చూశాక..
ఓసారి ఓన్లీఫ్యాన్స్ అనే అడల్ట్ వెబ్‌సైట్ చూశాక తనకు ఈ కొత్త కెరీర్ ఆలోచన వచ్చిందని రెనీ గ్రేసీ తెలిపింది. ‘ఆ పోర్న్ వెబ్‌సైట్‌లో నా నగ్న ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయడంతో తొలి వారంలోనే రెండున్నర లక్షల రూపాయలు సంపాదించా. అడల్డ్ స్టార్‌గా మారడం నా జీవితంలో చేసిన మంచి పని. 30 ఏళ్ల ఇంటి రుణాన్ని (ఈఎంఐ) ఏడాదిలోనే చెల్లించగలిగాను.'అని గ్రేసీ గర్వంగా తెలిపింది. అయితే గ్రేసీ నిర్ణయంతో వి8 సూపర్ కార్స్ అభిమానులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.
భారత ఆటగాళ్ల జంబలకిడిపంబ.. రోహితా మస్త్ ఉన్నవ్: చహల్

నా కల చెదిరింది..
కార్ రేసింగ్‌లో విఫలమవ్వడంతో డబ్బులు కూడా సంపాదించలేకపోయానని రెనీ చెప్పుకొచ్చింది. తాను చేసిన ఈ పని వల్ల తనను అపార్ధం చేసుకుంటారని తెలుసని, అన్నిటికీ సిద్దమయ్యే ఈ నిర్ణయం తీసుకున్నాని ఈ మాజీరేసర్ చెప్పుకొచ్చింది. 'నేను కార్ రేసింగ్‌లో మంచి ఫలితాలతో పాటు డబ్బులు కూడా సంపాదించలేకపోయా. నా వంతు ప్రయత్నం చేశా. కానీ ఫలితం దక్కకపోవడంతో పాటు నా కల చెదిరిపోయే దశకు చేరుకుంది. నేను తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇది ఒకటి. ఈ నిర్ణయం నన్ను మంచి స్థితిలో ఉంచింది. ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నా.

అపార్ధం చేసుకుంటారని తెలుసు..
ఎవరు నన్ను ఎలా పిలిచినా నేను స్వీకరిస్తా. ప్రస్తుతం నేను ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నా. దాంతో చాలా సంతోషంగా జీవిస్తున్నా. నేను పోర్న్ రంగంలోకి ఊరికే వెళ్ళలేదు. ఇలా చేయడం వల్ల నన్ను చాలామంది అపార్థం చేసుకుంటారని నాకు తెలుసు. కానీ నేను చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా. ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం బయటకు వస్తుందని నాకు తెలుసు. అంతేకాకుండా ఇది చాలా వివాదాస్పదంగా మారుతుందని కూడా తెలుసు. అన్నింటికి సిద్ధంగా ఉన్నా' అని రెనీ గ్రేసీ చెప్పుకొచ్చింది.
ఆ సూపర్ ఇన్నింగ్స్‌కు 37 ఏళ్లు.. క్రికెట్ పిచ్చికి బీజం పడింది అక్కడే.!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications