IND vs AFG: బుడ్డోడిని పక్కనపెట్టేందుకు బుద్దుండాలి.. సబ్‌స్క్రిప్షన్ బొక్క!
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు మేనేజ్‌మెంట్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న తొలి టీ20కి టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు ఈ సిరీస్ చూడాలనుకుందే ఈ 15 ఏళ్ల బుడ్డోడి కోసమని, అతనే లేనప్పుడు ఈ మ్యాచ్ ఎవడు చూస్తాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. వైభవ్ సూర్యవంశీకి బదులు సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. తుది జట్టు ఎంపికపై తనకు స్పష్టత లేదని, హెడ్ కోచ్‌దే పూర్తి నిర్ణయమని పరోక్షంగా వెల్లడించాడు. వైభవ్‌ను ఆడించకపోవడంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ, గంభీర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.
'వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ కోసమే నేను ఫ్యాన్ కోడ్ అకౌంట్ రిచార్జ్ చేసుకున్నా. కానీ బీసీసీఐ మరోసారి అతన్ని పక్కన పెట్టి గుడ్డిగా ఆడే సంజూ శాంసన్ తీసుకుంది. రిచార్జ్ బొక్క. ఎవడు చూస్తాడు ఈ మ్యాచ్'అని ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. 15 ఏళ్ల కుర్రాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని మరో నెటిజన్ మండిపడ్డాడు.

జింబాబ్వే పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన తర్వాత కూడా వైభవ్‌ను తప్పించడం ఏంటని మరొకరు నిలదీసారు. మొదటి నుంచి వైభవ్ అంటే గంభీర్‌కు నచ్చడం లేదని, దాంతోనే అతనికి తగిన అవకాశాలు ఇవ్వడం లేదని మరికొందరు ఆరోపించారు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఒక్కడు కూడా బుడ్డోడిలా ఆడలేరని, అయినా అతన్ని పక్కనపెట్టేందుకు బుద్దుండాలని విమర్శలు గుప్పిస్తున్నారు.
వైభవ్ సూర్యవంశీ కోసమే ఈ సిరీస్ చూస్తారని, అతనే లేనప్పుడు ఈ మ్యాచ్‌ను ఎవడూ పట్టించుకోడని కామెంట్ చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. వైభవ్ సూర్యవంశీకి వరుస అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. అవసరమైతే అభిషేక్ శర్మను పక్కనపెట్టాలని అభిప్రాయపడుతున్నారు.
భారత్ తుది జట్టు: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

" width="200" height="113">