Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే వైభవ్ సూర్యవంశీని ఆడించడం లేదు: శ్రేయస్ అయ్యర్

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఈ మ్యాచ్‌కు టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ దూరమయ్యాడని అయ్యర్ తెలిపాడు. తుది జట్టు ఎంపిక చాలా కష్టంగా ఉందని చెప్పాడు. ఈ విషయంలో తుది నిర్ణయం హెడ్ కోచ్‌దేనని పరోక్షంగా వెల్లడించాడు.

IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. ఢిల్లీ మ్యాచ్‌కు భారీ అడ్డంకి!

IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. ఢిల్లీ మ్యాచ్‌కు భారీ అడ్డంకి!

అతను మ్యాచ్ విన్నర్..

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. సాధారణంగా టీ20 క్రికెట్‌లో చేసేది ఇదే. అంతేకాకుండా ఢిల్లీ పిచ్ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ఇక్కడ చాలా మ్యాచ్‌లు ఆడాం. పిచ్ కండిషన్స్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. కెప్టెన్‌గా నా తొలి 10 మ్యాచ్‌లు చాలా కష్టంగా సాగాయి. కానీ జింబాబ్వేతో సిరీస్‌లో మాకు చాలా సానుకూల అంశాలు లభించాయి. కుర్రాళ్లు చాలా పాజిటివ్‌గా ఆడారు.

IND vs AFG Shreyas Iyer Reveals Why Vaibhav Sooryavanshi Was Dropped for 1st T20I Against Afghanistan

అదే జోష్‌ను ఈ సిరీస్‌లోనూ కొనసాగించాలని అనుకుంటున్నాం. జస్‌ప్రీత్ బుమ్రా జట్టులో ఉండటం కలిసొచ్చే అంశం. అతనికి అపారమైన అనుభవం ఉంది. మ్యాచ్ గెలిపించాలనే కసి అతనిలో స్పష్టంగా కనిపిస్తోంది. అతను పక్కా మ్యాచ్ విన్నర్. జట్టుకు ఎంతగా ఉపయోపడతాడో అందరికి తెలుసు.

వైభవ్ ఆడట్లేదంటే.. సుందర్ కూడా ఆడడు..

తుది జట్టు ఎంపిక చాలా కష్టమైనది. ముఖ్యంగా కొంత మంది ఆటగాళ్లను పక్కడ పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ ఆడట్లేదంటే.. వాషింగ్టన్ సుందర్ కూడా ఆడటం లేదని అర్థం. బెంచ్‌పై ఉన్న మరో ఇద్దరు ఆటగాళ్లు ఎవరు అనేది మీకు తెలుస్తుంది.'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. తుది జట్టు ఎంపికపై తనకు స్పష్టమైన సమాచారం లేదని అయ్యర్ చెప్పకనే చెప్పాడు.

మరోవైపు టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామని అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జడ్రాన్ తెలిపాడు. కానీ టాస్ తమ చేతుల్లో లేని పనని, ముందుగా బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని నమోదు చేసే ప్రయత్నం చేస్తామన్నాడు. భారత్‌లో భారత్‌కు ఆతిథ్యం ఇవ్వడం గొప్ప అనుభూతినిస్తోందన్నాడు. అభిమానుల మద్దతు గొప్ప శక్తినిస్తుందని చెప్పాడు. నవీన్ ఈ మ్యాచ్ ఆడటం లేదని, తదుపరి మ్యాచ్‌లో అతిని గురించి ఆలోచిస్తామని తెలిపాడు.

బుడ్డోడికి స్కెచ్ వేసాం.. వైభవ్ సూర్యవంశీకి అఫ్గాన్ కెప్టెన్ వార్నింగ్!

Also Read

బుడ్డోడికి స్కెచ్ వేసాం.. వైభవ్ సూర్యవంశీకి అఫ్గాన్ కెప్టెన్ వార్నింగ్!

తుది జట్లు:

భారత్: సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

అఫ్ఘానిస్తాన్ : ఇబ్రహీం జద్రాన్ (సి), రహ్మానుల్లా గుర్బాజ్ (డబ్ల్యు), సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్.

Story first published: Sunday, September 13, 2026, 19:38 [IST]
Other articles published on Sep 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+