Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్, అగార్కర్ కుట్రలకు చీఫ్ ఫిజియో థెరపిస్ట్ బలి!

భారత ఆటగాళ్ల వరుస గాయాల నేపథ్యంలో చీఫ్ ఫిజియో థెరపిస్ట్ కమలేష్ జైన్‌పై బీసీసీఐ వేటు వేసింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్‌ల ఫిర్యాదుతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు నుంచి చివరి నిమిషంలో జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్‌లు తప్పుకున్న సంగతి తెలిసిందే.

గాయాల నుంచి కోలుకోకపోవడంతో జట్టుకు దూరమయ్యారు. అయితే వారి గాయాల విషయంలో చీఫ్ ఫిజియోథెరపిస్ట్ కమలేష్ జైన్ టీమిండియా మేనేజ్‌మెంట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చాడని గంభీర్‌తో పాటు అగార్కర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

అందుకే భారత ఆటగాళ్లకు తరుచూ గాయాలు: బీసీసీఐ సెక్రటరీ

అందుకే భారత ఆటగాళ్లకు తరుచూ గాయాలు: బీసీసీఐ సెక్రటరీ

అగార్కర్ ఫిర్యాదుతో..

అంతేకాకుండా గత రెండు నెలల్లో 10 మందికిపైగా భారత ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. గాయాల నుంచి కోలుకోని బరిలోకి దిగిన వెంటనే మళ్లీ గాయపడ్డారు. ఆటగాళ్ల గాయాలతో జట్టు ప్రణాళికలు దెబ్బతింటున్నాయని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే కమలేష్ జైన్ పనితీరును సమీక్షించిన బీసీసీఐ అతన్ని విధుల నుంచి తొలగించింది.

Gautam Gambhir and Ajit Agarkar s Dissatisfaction Behind BCCI s Decision to Remove Head Physio Kamlesh Jain

అగ్రశ్రేణి ఆటగాళ్లు తరుచూ గాయాల బారిన పడటంతో భారత జట్టు గెలుపు అవకాశాలు ప్రభావితమవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త ఫిజియోథెరపిస్ట్‌ను నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం కమలేష్ జైన్ నోటీస్ పీరియడ్‌లో ఉండగా.. కొత్త ఫిజియోథెరపిస్ట్ వచ్చే వరకు అతను ఈ బాధ్యతల్లో కొనసాగనున్నాడు.

కొత్త ఫిజియోథెరపిస్ట్ నియామకానికి సంబంధించిన వార్తలను బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి. గంభీర్, అగార్కర్ తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కమలేష్ జైన్‌ను బలి చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

టీమిండియా ముమ్మురంగా సాధన

అఫ్గాన్‌తో మూడు టీ20ల సిరీస్ ఆదివారం ఢిల్లీలో మొదలవ్వనుంది. గాయాల నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి.. స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే పర్యవేక్షణలో బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. గాయాల నుంచి కోలుకున్న జస్‌ప్రీత్ బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి ఈ రోజు నుంచి శిక్షణ ప్రారంభించనున్నారు.

మ్యాచ్‌కు రూ.1.2 కోట్లు.. బీసీసీఐ స్పాన్సర్‌గా ఏఐ దిగ్గజం చాట్‌జీపీటీ!

Also Read

మ్యాచ్‌కు రూ.1.2 కోట్లు.. బీసీసీఐ స్పాన్సర్‌గా ఏఐ దిగ్గజం చాట్‌జీపీటీ!

దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఆడిన ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ ఆలస్యంగా జట్టుతో కలవనున్నారు. దాంతో 10 మంది ఆటగాళ్లు మాత్రమే ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్నారు. హర్షిత్ రాణా స్థానంలో జట్టులోకి వచ్చిన యశ్ ఠాకూర్ కూడా తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు.. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్‌ల స్పిన్ బౌలింగ్‌ను సాధన చేశారు.

Story first published: Friday, September 11, 2026, 12:42 [IST]
Other articles published on Sep 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+