Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రేపే బీసీసీఐ రివ్యూ మీటింగ్.. గంభీర్, అగార్కర్‌, లక్ష్మణ్‌కు పిలుపు!

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో టీమిండియా వైఫల్యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్వహించాలనుకున్న సమీక్ష సమావేశానికి ఎట్టకేలకు ముహుర్తం ఖరారైంది. ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ మీటింగ్‌ను గురువారం(సెప్టెంబర్ 3) ముంబైలోని బీసీసీఐ హెడ్ ఆఫీస్‌లో నిర్వహించనున్నట్లు దైనిక్ జాగరన్ అనే న్యూస్ పేపర్ పేర్కొంది.

IND vs AFG: భారత్ జట్టులో దక్కని చోటు.. కృనాల్ పాండ్యా రియాక్షన్ ఇదే!

IND vs AFG: భారత్ జట్టులో దక్కని చోటు.. కృనాల్ పాండ్యా రియాక్షన్ ఇదే!

బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ సీఓఈ హెడ్ వీవీఎస్ లక్ష్మన్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హాజరుకానున్నారు. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటన వైఫల్యంతో పాటు ఆటగాళ్లు తరుచు గాయాల బారిన పడటం, భవిష్యత్తు సిరీస్‌లకు అనుసరించాల్సిన వ్యూహాలపై బీసీసీఐ పెద్దలతో టీమ్‌మేనేజ్‌మెంట్ చర్చించనుంది.

BCCI Summons Gautam Gambhir Ajit Agarkar and VVS Laxman to Review India s Poor Away Form

ఆటగాళ్ల గాయాలే.. ప్రధాన ఎజెండా..

'ఈ సమావేశంలో టీమ్‌ మేనేజ్‌మెంట్ తమ అవసరాలు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి బోర్డుకు తమ వాదనను వినిపించనుంది. ముఖ్యంగా ఆటగాళ్లు తరుచూ గాయపడటం వల్ల కీలక పర్యటనలకు సరైన కాంబినేషన్‌ బరిలోకి దించలేకపోవడం ప్రధాన చర్చనీయాంశం కానుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో భారత్ ఓటములపై కూడా బీసీసీఐ వివరణ కోరనుంది. అంతేకాకుండా భవిష్యత్తు విదేశీ పర్యటనలను దృష్టిలో ఉంచుకొని బోర్డు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

శ్రీలంక పర్యటనకు జట్టును ఎంపిక చేయడానికి కొద్ది రోజుల ముందు.. జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌గా లేడన్న విషయం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు కూడా తెలియదు. ఆయన ఈ విషయంపై సీఓఈకి ఒక ఇమెయిల్ కూడా పంపారు. ఈ విషయంపై లక్ష్మణ్‌ను బీసీసీఐ పెద్దలు వివరణ కోరే అవకాశం ఉంది.

ఆరుగురు పేసర్లతో..

న్యూజిలాండ్ పర్యటనకు 5 నుంచి ఆరుగురు భారత పేసర్లను తీసుకోవాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్ వంటి ఆటగాళ్ల పేర్లపై చర్చ జరగనుంది. ఈ బౌలర్ల అందుబాటులో ఉన్నారా?, ఫిట్‌నెస్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలను కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.'అని సదరు న్యూస్ పేపర్ పేర్కొంది.

మరోవైపు భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికాలం పొడిగింపుపై సెప్టెంబర్ 18న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. అగార్కర్, గౌతమ్ గంభీర్ మధ్య మంచి రిలేషన్ ఉండటంతో అతని పదవికాలాన్ని పొగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

IND vs AFG: సంజూ‌కు నో ఛాన్స్.. నితీష్ రెడ్డి డౌట్! అఫ్గా‌న్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

Also Read

IND vs AFG: సంజూ‌కు నో ఛాన్స్.. నితీష్ రెడ్డి డౌట్! అఫ్గా‌న్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

'సెప్టెంబర్ 18న జరిగే బీసీసీఐ ఏజీఎంలో అగార్కర్ కాంట్రాక్ట్ పొడిగింపుపై చర్చించే అవకాశం ఉంది. జూనియర్ సెలక్షన్ కమిటీ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించినప్పటికీ, సీనియర్ సెలక్షన్ కమిటీ కోసం ఇంకా ఎలాంటి దరఖాస్తులను కోరలేదు.'అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు.

Story first published: Wednesday, September 2, 2026, 13:58 [IST]
Other articles published on Sep 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+