IND vs SL: టాస్ ఓడిన భారత్.. బరిలో వైభవ్ సూర్యవంశీ!
ఆసియా గేమ్స్ 2026లో భాగంగా భారత్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విభిన్నమైన కాంబినేషన్‌తో బరిలోకి దిగింది. ఒకే ఒక ఫ్రంట్ లైన్ పేసర్‌ను ఎంచుకుంది. ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించింది. వైభవ్ సూర్యవంశీ రాకతో సంజూ శాంసన్ ఫస్ట్ డౌన్‌కు డిమోట్ అయ్యాడు.
ఏకైక పేసర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా బరిలోకి దిగగా.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే అతనితో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. జపాన్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌లు స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.

ఈ టోర్నీలో భారత్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. మెరుగైన ఐసీసీ ర్యాంకుతో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్.. వర్షం కారణంగా ఆ మ్యాచ్ ఆడలేదు. అఫ్గానిస్థాన్‌తో జరగాల్సిన ఆ మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. దాంతో మెరుగైన ర్యాంక్ కలిగిన భారత్ సెమీస్‌కు అర్హత సాధించింది. సెమీస్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది.
ఈ మ్యాచ్ కూడా సజావుగా జరగకుంటే శ్రీలంక కంటే మెరుగైన ర్యాంక్ కలిగిన భారత్ ఫైనల్ చేరుతుంది. అక్టోబర్ 3న ఫైనల్ జరగనుంది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న జపాన్ పిచ్‌లపై భారత బ్యాటర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పరిస్థితులతో సంబంధం లేకుండా చెలరేగే భారత బ్యాటర్లకు ఈ స్పిన్ కండిషన్స్ సవాల్‌గా మారనున్నాయి.
తుది జట్లు:
శ్రీలంక: లసిత్ క్రూస్‌పుల్లే, సినేత్ జయవర్ధనే, సోహన్ డి లీవెరా(వికెట్ కీపర్), అಶెన్ బండార, సాహాన్ అరచ్చిగే(కెప్టెన్), నువాండో ఫెర్నాండో, చమిక కరుణరత్నే, వనుజ సాహాన్, విజయకాంత్ వియస్కాంత్, తరిందు రత్నాయకే, బినుర ఫెర్నాండో
భారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ఇಶాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

" width="200" height="113">