Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అది సీక్రేట్ ఎవరికీ చెప్పను.. మ్యాచ్ మలుపు తిరిగిందక్కడే: రోహిత్ శర్మ

తన సెంచరీ సెలెబ్రేషన్స్ సీక్రేట్ అని, ఎవరికి చెప్పనని టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అన్నాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి తాను నెలకొల్పిన 255 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పిందని అభిప్రాయపడ్డాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది.

406 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 44 ఓవర్లలోనే ఛేదించింది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 407 పరుగులు చేసి 39 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. శుభ్‌మన్ గిల్(130 బంతుల్లో 25 ఫోర్లు, 8 సిక్స్‌లతో 217 నాటౌట్) అజేయ డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. రోహిత్ శర్మ(75 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101) సెంచరీతో కదం తొక్కాడు. ఈ సెంచరీని హిట్ మ్యాన్ వినూత్నంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. గాల్లో సైకిల్ తొక్కుతున్నట్లు పరుగెత్తి.. పంచ్ ఇచ్చాడు. ఈ సెలెబ్రేషన్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

Rohit Sharma Opens Up on His 35th ODI Century Celebration and Partnership With Shubman Gill
Photo Credit: screen grab for JioHotstar

నేను అస్సలు చెప్పను..

ఈ మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన రోహిత్ శర్మను ఈ సెలెబ్రేషన్స్ గురించి ఆరా తీయగా చెప్పేందుకు నిరాకరించాడు. అది తన వ్యక్తిగతమని, అందరితో పంచుకోలేనని స్పష్టం చేశాడు. 'నా సెంచరీ సెలబ్రేషన్‌‌ను నాలోనే ఉంచుకుంటా. అది నాకోసం చేసుకున్నది. కొన్ని విషయాలు బయట చెప్పుకోకపోవడమే బాగుంటుంది. అందరితో పంచుకోలేం. అందుకే ఆ సెలెబ్రేషన్స్ గురించి చెప్పలేను. పిచ్ బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంది. దాంతో ఎక్కువగా ఆలోచించకుండా కేవలం బ్యాటింగ్ చేస్తూ ముందుకు సాగాలనుకున్నాం. నిజం చెప్పాలంటే.. బోర్డు మీద ఉన్న స్కోర్ గురించి ఎక్కువగా ఆలోచించలేదు.

IND vs WI: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. 53 ఏళ్లలో ఇదే తొలిసారి!

IND vs WI: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. 53 ఏళ్లలో ఇదే తొలిసారి!

భాగస్వామ్యంతో గెలిపించాం..

బంతికి తగ్గట్లు షాట్లు ఆడుతూ.. భాగస్వామ్యాన్ని నిర్మించాలనుకున్నాం. భారీ లక్ష్యాలను ఛేదించేటప్పుడు పెద్ద భాగస్వామ్యాలు చాలా అవసరమవుతాయి. మేం అదే చేశాం. మరోవైపు శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడాడు. ఇన్నింగ్స్ మొత్తం పూర్తి నియంత్రణతో బ్యాటింగ్ చేశాడు. అతను చివరి వరకు అజేయంగా నిలవడం ఆకట్టుకుంది.

ఎండలో 50 ఓవర్ల ఫీల్డింగ్ తర్వాత బ్యాటింగ్ చేయడం అనేది మన ఏకాగ్రతపైనే ఆధారపడి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వికెట్ పారేసుకోకూడదని అనుకున్నాం. ఇక్కడి కండిషన్స్ కాస్త కఠినంగానే ఉన్నాయి. కానీ నా అనుభవం ఉపయోగపడింది. వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని అనుకున్నాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని మాకు తెలుసు. టాపార్డర్ నుంచి మంచి ఆరంభం దక్కాలని భావించాం. అనుకున్నట్లు అదే జరిగింది. శుభ్‌మన్ గిల్, నేను కలిసి నెలకొల్పిన 250+ పరుగుల భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మొత్తానికి ఈ మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉంది.

IND vs WI: శుభ్‌మన్ గిల్ ద్విశతకం.. భారత్ ఘన విజయం!

Also Read

IND vs WI: శుభ్‌మన్ గిల్ ద్విశతకం.. భారత్ ఘన విజయం!

జడేజా ఫ్లిప్ కొట్టమన్నాడు..

నా సెలెబ్రేషన్స్ గురించి డగౌట్ నుంచి జడేజా నన్ను అడిగాడు. డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చాక చెబుతా.. అది నా వ్యక్తిగతమని చెప్పాను. కానీ అతను చాలా విభిన్నంగా ఆలోచించాడు. గ్రౌండ్‌లో ఫ్లిప్ కొడుతూ.. గాల్లోకి ఎగిరి సెలెబ్రేట్ చేసుకోమన్నాడు. 50 ఓవర్లు ఫీల్డింగ్ చేసి.. మళ్లీ 25-30 ఓవర్లు బ్యాటింగ్ చేశాక అలా చేయడం కుదరదని చెప్పాను.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, September 30, 2026, 23:00 [IST]
Other articles published on Sep 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+