Asian Games 2026: మూడో రోజు ఒక స్వర్ణం.. మరో రెండు పతకాలు ఖాయం!
ఆసియా గేమ్స్ 2026 మూడో రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత మహిళల జట్టు మొదటి స్వర్ణ పతకం అందించగా.. పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ సెమీస్ చేరుకొని పతకం ఖాయం చేసింది. భారత వుషు ప్లేయర్ రోషిబిన కూడా సెమీఫైనల్ చేరి మెడల్ ఖాయం చేసుకుంది.
మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో మాత్రం భారత్‌కు నిరాశే ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో జపాన్ చేతిలో భారత మహిళల టీమ్ ఓటమిపాలైంది. షూటింగ్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా భారత్‌కు పతకం చేజారింది. ఎలవెనిల్ వలరివన్-పార్థ్ మన్నె జోడీ ఫైనల్‌కు అర్హత సాధించినా.. నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

భారత మహిళల జట్టు మాత్రం అంచనాలను నిజం చేస్తూ పసిడిని ముద్దాడింది. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసింది. పురుషు బ్యాడ్మింటన్ టీమ్ క్వార్టర్ ఫైనల్లో 3-0 తేడాతో జపాన్‌ను ఓడించింది. చైనా-కొరియా మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో భారత్ సెమీస్ ఆడనుంది.
రోషిబిన తనను కావాలనే గాయం చేసిందని.. ఆసియా క్రీడల్లో ఆడకుండా చేసిందని వుషు క్రీడాకారిణి దివ్యాంశి ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రోషిబిన భారత్‌కు పతకం అందించనుంది. 60 కేజీల విభాగంలో సెమీస్‌కు దూసుకెళ్లింది. మరో అథ్లెట్ ఆర్యన్‌కు 56 కేజీల క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమి తప్పలేదు. జిమ్నాస్టిక్స్ మహిళల వాల్ట్ విభాగంలో ప్రణతి నాయక్ ఫైనల్‌కు చేరుకుంది.
ఈ ఆసియా గేమ్స్‌లో చైనా 50 ప్లస్ పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చైనా ఇప్పటి వరకు 31 స్వర్ణాలు, 13 రజతాలు, 8 కాంస్య పతకాలు సాధించింది. భారత్ ఒక స్వర్ణం 4 రజతాలు, 2 కాంస్య పతకాలతో మెడల్స్ టేబుల్‌లో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఆతిథ్య జపాన్ 11 స్వర్ణాలు, 15 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తం 45 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
" width="200" height="113">
