Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: భారత్‌కు స్వర్ణం.. హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగం!

ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళల జట్టు స్వర్ణం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ టోర్నీ బరిలోకి దిగిన భారత్ హ్యాట్రిక్ విజయాలతో విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ 147 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది.

IND vs JPN: ఓడినా.. వరల్డ్ బెస్ట్ టీమ్‌ను వణికించాం: జపాన్ కెప్టెన్

IND vs JPN: ఓడినా.. వరల్డ్ బెస్ట్ టీమ్‌ను వణికించాం: జపాన్ కెప్టెన్

ఈ విజయంతో వరుసగా రెండోసారి భారత్ స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. పోడియంపై మువ్వన్నెల జెండా రెపరెపలాడటంతో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ భావోద్వేగానికి గురైంది. ఓవైపు జాతీయ గీతాలాపన జరుగుతుండగా.. మరోవైపు ఉబికి వస్తున్న దు:ఖాన్ని హర్మన్‌ప్రీత్ కౌర్ ఆపుకోలేకపోయింది. ఆనందభాష్పాలను రాల్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Harmanpreet Kaur Gets Emotional as India Win Gold Medal After Beating Sri Lanka at Asian Games 2026

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 79), రిచా ఘోష్(22 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 49 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. షెఫాలీ వర్మ(29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48) కూడా దూకుడుగా ఆడింది. శ్రీలంక బౌలర్లలో సుగందిక కుమారి, కావిషా దిల్‌హరి, చాముడి ప్రబోద తలో వికెట్ తీసారు.

అనంతరం శ్రీలంక 15.4 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చమరి ఆటపట్టు(21 బంతుల్లో 5 ఫోర్లతో 29) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో దిప్తీ శర్మ(3/6) మూడు వికెట్లు తీయగా.. షెఫాలీ వర్మ, శ్రేయాంక పాటిల్, శ్రీచరణి తలో రెండు వికెట్లు పడగొట్టారు.

IND vs SL: శ్రీలంక చిత్తు.. భారత్‌కు స్వర్ణ కిరీటం!

Also Read

IND vs SL: శ్రీలంక చిత్తు.. భారత్‌కు స్వర్ణ కిరీటం!

ఆసియా గేమ్స్ 2026లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం గమనార్హం. ఫైనల్లో ఓడిన శ్రీలంకకు రజత పతకం దక్కగా.. పాకిస్థాన్‌కు బ్రాంజ్ మెడల్ నెగ్గింది. బంగ్లాదేశ్‌తో జరిగిన కాంస్య పోరులో పాకిస్థాన్ విజయం సాధించింది. ఈ టోర్నీలో హర్మన్‌ సేన పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇటీవలే ముగిసిన ఆసియా 2026 ఫలితాలను పునరావృతం చేసింది.

Story first published: Tuesday, September 22, 2026, 17:52 [IST]
Other articles published on Sep 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+