IND vs JPN: ఓడినా.. వరల్డ్ బెస్ట్ టీమ్‌ను వణికించాం: జపాన్ కెప్టెన్
భారత్‌తో ఏకైక టీ20లో ఓడినా.. వరల్డ్ బెస్ట్ టీమ్‌ను వణికించామని జపాన్ కెప్టెన్ కెండెల్ కాడోవాకి-ఫ్లెమింగ్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో తమ జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉందని చెప్పాడు. ఆసియా గేమ్స్ 2026కు ముందు ఇరు దేశాల మధ్య దౌత్య స్నేహానికి గుర్తుగా నిర్వహించిన ఏకైక టీ20లో భారత్ 2 పరుగుల తేడాతో జపాన్‌ను ఓడించింది.
ఈ మ్యాచ్‌లో ఓడినా.. భారత్‌కు జపాన్ గట్టి పోటీ ఇచ్చింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించగా.. జపాన్ బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆకట్టుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 5 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 32 పరుగులే చేసింది. శ్రేయస్ అయ్యర్(12 బంతుల్లో ఫోర్‌తో 16) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్(9), అభిషేక్ శర్మ(0), ఇషాన్ కిషన్(3) తీవ్రంగా నిరాశపర్చారు. జపాన్ బౌలర్లలో చార్లీ హరా-హింజ్2 వికెట్లు తీయగా.. ఇబ్రహీం తకాహషి, బెంజమిన్ ఇటో-డేవిస్ తలో వికెట్ తీసారు.

అనంతరం జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లకు 30 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టు కెప్టెన్ కెండెల్(12 బంతుల్లో ఫోర్‌తో 12) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(2/13) రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(0/7), రవి బిష్ణోయ్(0/10) కట్టడిగా బౌలింగ్ చేశారు.
ఓడినా.. గర్వంగా ఉంది..
ఈ మ్యాచ్ అనంతరం తమ ప్రదర్శనపై కెండెల్ కాడోవాకి-ఫ్లెమింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. వరల్డ్ బెస్ట్ టీమ్‌ను ఆఖరి బంతి వరకు నిలవరించడం గొప్ప విషయమని తెలిపాడు. 'ప్రపంచంలోనే అత్యుత్త జట్టు అయిన భారత్‌ను ఆఖరి బంతి వరకు నిలవరించి పోరాడటం గొప్ప విషయం. అయితే ఇంత దగ్గరగా వచ్చి ఓడిపోవడం కొంచెం బాధగా ఉన్నా.. మా టీమ్ ప్రదర్శన చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ జపాన్ క్రికెట్ పురోగతి గురించి మాట్లాడటం కలలా అనిపిస్తోంది.
ఈ మ్యాచ్ సాధ్యమవడానికి సహకరించిన స్పాన్సర్లు, బీసీసీఐ, జపాన్ క్రికెట్ అసోసియేషన్‌కు ధన్యవాదాలు. రాత్రంతా కష్టపడి మైదానాన్ని సిద్దం చేసిన వాలంటీర్లు, సపోర్ట్ చేసిన మా ఉమెన్స్ టీమ్‌కు కృతజ్ఞతలు. మా 17 ఏళ్ల చార్లీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇటో-డెవిస్, తకాహాషి కూడా ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్ ఆడే భారత బ్యాటర్లను కట్టడి చేశారు.
మెడల్ సాధించడమే మా లక్ష్యం..
వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్న జట్టుపై 6.5 రన్ రేట్ సాధించడం కష్టమే అని మాకు తెలుసు. అయినా ఏమైనా జరగొచ్చనే సానుకూల ఆలోచనతో ఆడి చివరి బంతి వరకు తీసుకెళ్లాం. ఈ ప్రదర్శనతో మా ఆత్మవిశ్వాసం పెరిగింది. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా నాకౌట్స్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆసియా క్రీడల్లో మెడల్ సాధించడమే మా తదుపరి లక్ష్యం.'అని కెండెల్ కాడోవాకి-ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


