For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ నెలకొల్పిన కష్టసాధ్యమైన 5 రికార్డులు!

5 Rohit Sharma’s records that are tough to break
Rohit Sharma's 5 Records That Are Tough To Break

హైదరాబాద్: టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో కొంత తడబడిన ఈ ముంబైకర్ అనంతరం తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టులో పాతుకుపోయాడు. అసాధ్యమైన ఘనతలను అలవోకగా అందుకుంటూ మరెవరూ చేరుకోలేని రికార్డులు నెలకొల్పాడు. ముఖ్యంగా తన 13 ఏళ్ల కెరీర్‌లో హిట్ మ్యాన్ నెలకొల్పిన కష్ట సాధ్యమైన రికార్డులుపై ఓ లుక్కెద్దాం.

వన్డేల్లో వ్యక్తిగత అత్యధిక స్కోర్..

వన్డేల్లో వ్యక్తిగత అత్యధిక స్కోర్..

అంతర్జాతీయ వన్డేల్లో రోహిత్ (264*) అత్యధిక వ్యక్తిగత స్కోర్. 2014 నవంబర్ 13న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హిట్ మ్యాన్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. అప్పటికే భారత్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో బ్యాట్స్‌‌మన్‌గా గుర్తింపు పొందిన రోహిత్.. ఈ మ్యాచ్‌తో రెండో డబుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఈ ముంబైకర్ కన్నా ముందు డబుల్ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. అనంతరం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో మిగతా 164 పరుగులు కేవలం 73 బంతుల్లోనే నమోదయ్యాయి. 33 బౌండరీలు, 9 సిక్సర్లతో విరవిహారం చేయడంతో భారత్ 404 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం శ్రీలంక 251 రన్స్‌కే పరిమితమై ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్‌కు 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లైఫ్ లభించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రోహిత్ మరెవరికీ సాధ్యం కానీ.. దారిదాపుల్లో రాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

వదినా.. ట్రిమ్మర్‌తో గుండు కొట్టాల్సింది: చహల్

అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన ప్లేయర్..

అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన ప్లేయర్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రోహిత్ అత్యంత విజయవంతమైన ఆటగాడు. తన సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు మొత్తం నాలుగు టైటిళ్లు అందించాడు. గత సీజన్ ఫైనల్లో చెన్నైని తన సూపర్ కెప్టెన్సీతో ఒక్క పరుగుతో ఓడించి ట్రోఫీని ముద్దాడాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ ప్లేయర్‌గా ఐదు టైటిళ్లు అందుకున్న ఘనతను అందుకున్నాడు.

2009లో డెక్కెన్ చార్జెస్ ప్లేయర్‌గా తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన రోహిత్.. 2011లో ముంబై ఇండియన్స్‌ జట్టుతో చేరాడు. ఆ జట్టు సారథిగా 2013, 2015, 2017, 2019 సీజన్లలో టైటిళ్లు అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఐదు ట్రోఫీలు అందుకున్న ప్లేయర్ రోహిత్ ఒక్కడే కాగా.. యూసఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, అంబటి రాయుడు ముగ్గురు ప్లేయర్లే నాలుగు ఐపీఎల్ టైటిళ్లు అందుకున్నారు.

కరోనా కట్టడికి రహానే విరాళం.. ఎంతో తెలుసా?

వన్డేల్లో ట్రిపుల్ డబుల్ సెంచరీలు..

వన్డేల్లో ట్రిపుల్ డబుల్ సెంచరీలు..

అంతర్జాతీయ వన్డేల్లో ట్రిపుల్ డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. చివరిసారిగా 2017లో శ్రీలంకపై రెండో సారి డబుల్ సెంచరీ చేసిన హిట్ మ్యాన్.. 2013లో ఆస్ట్రేలియాపై 209, 2014లో శ్రీలంకపై 264 పరుగులు చేశాడు. దీంతో మరెవరికీ సాధ్యం కానీ మూడు డబుల్ సెంచరీల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రికార్డును అధిగమించడం ప్రస్తుత తరంతో పాటు రాబోయే తరానికి కూడా కష్టమే.

వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు..

వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు..

2011 వరల్డ్‌కప్‌లో చోటు దక్కకపోవడం తన కెరీర్‌లో అత్యంతగా బాధపడిన సందర్భమని చెప్పిన రోహిత్.. గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో మాత్రం తన కసిని బంతిపై తీర్చుకున్నాడు. ప్రతీ మ్యాచ్‌లో తనదైన శైలిలో చెలరేగుతూ భారత్ సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీల్లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన హిట్ మ్యాన్ 81 సగటుతో ఐదు సెంచరీలు.. ఒక హాఫ్ సెంచరీతో 648 పరుగులు చేశాడు. కానీ కీలక సెమీస్‌లో రోహిత్ చేతులెత్తేయడం.. అతని బాటలనో భారత బ్యాట్స్‌మన్ క్యూ కట్టడంతో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తప్పలేదు.

తన రెండు వరల్డ్ కప్‌లో మొత్తం 6 సెంచరీలు సాధించిన రోహిత్.. సచిన్ టెండూల్కర్ 6 సెంచరీలతో సమంగా నిలిచాడు. సచిన్ 44 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు చేయగా..రోహిత్ కేవలం 16 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. అయితే ఒక వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధికంగా ఐదు సెంచరీలు సాధించిన రికార్డును మాత్రం రోహిత్ సొంతం చేసుకున్నాడు.

అప్పుడు వరల్డ్‌కప్ హీరో.. ఇప్పుడు రియల్ వరల్డ్ హీరో.. జోగిందర్‌కు ఐసీసీ సలాం!!

అత్యధిక టీ20 సెంచరీలు..

అత్యధిక టీ20 సెంచరీలు..

తన విధ్వంసకర బ్యాటింగ్‌కు సరిగ్గా సరిపోయే ధనాధన్ టీ20 ఫార్మాట్‌లో రోహిత్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2007లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన హిట్ మ్యాన్.. 100 టీ20ల్లో 140 స్ట్రైక్ రేట్‌తో 2773 పరుగులు చేశాడు. ఇందులో 21 హాఫ్ సెంచరీలు.. నాలుగు సెంచరీలున్నాయి. అయితే టీ20ల్లోనాలుగు సెంచరీలతో అత్యధిక శతకాలు బాధిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ గుర్తింపు పొందాడు.

ఈ ముంబైకర్ తర్వాత గ్లేన్ మ్యాక్స్‌వెల్, కొలిన్ మున్రో మూడు సెంచరీలతో ఉన్నారు. ఇక భారత్ నుంచి కేఎల్ రాహుల్ ఒక్కడే రెండు శతకాలు బాధాడు. అయితే రోహిత్ ప్రస్తుత ఫామ్ ప్రకారం అతను మరో 6 నెలల్లో ఇంకో శతకం బాధొచ్చు. ఈ రికార్డును అధిగమించడం కూడా ప్రస్తుత తరం, రాబోయే తరానికి కష్టమే.

Story first published: Monday, March 30, 2020, 8:49 [IST]
Other articles published on Mar 30, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+