Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వదినా.. ట్రిమ్మర్‌తో గుండు కొట్టాల్సింది: చహల్

Yuzvendra Chahal hilariously trolls Virat-Anushka’s haircut video

హైదరాబాద్: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సోషల్ మీడియా వేదికగా చేసే హడావిడి అంత ఇంత కాదు. భారత జట్టులోనే ఇతనో కమెడియన్ అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన చేష్టలతో అటు తన సహచర ఆటగాళ్లను ఇటు అభిమానులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు.

Yuzvendra Chahal Hilariously Trolls Virat Kohli Anushka Sharma Hair Cut Video | Oneindia Telugu
సోషల్ మీడియాలో చహల్ హల్‌చల్..

సోషల్ మీడియాలో చహల్ హల్‌చల్..

ఇక కరోనా వైరస్ కారణంగా క్రీడా ఈవెంట్లన్నీ రద్దవ్వడంతో ఇంటికే పరిమితమైన ఈ లెగ్ స్పిన్నర్.. తనకు దొరికిన ఈ ఖాలీ సమయాన్ని టిక్ టాక్ వీడియోలతో అలరిస్తూ ఆస్వాదిస్తున్నాడు. ట్విటర్ వేదికగా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. అంతేకాకుండా సెలబ్రిటీలు, తన సహచర క్రికెటర్ల పోస్ట్‌లపై ఫన్నీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేసిన పోస్ట్‌కు చహల్ చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయింది.

అప్పుడు వరల్డ్‌కప్ హీరో.. ఇప్పుడు రియల్ వరల్డ్ హీరో.. జోగిందర్‌కు ఐసీసీ సలాం!!

కోహ్లీ హెయిర్ కట్‌చేసిన అనుష్క..

21 రోజుల లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన విరాట్.. అతని సతీమణి అనుష్కశర్మతో హెయిర్ కట్ చేసుకున్నాడు. ఈ వీడియోను అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘క్వారంటైన్‌లో ఇలా'అనే క్యాప్షన్‌తో పంచుకుంది. ఈ వీడియోలో.. క్వారంటైన్​లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని విరాట్ కోహ్లీఅనగా.. వెనకనే ఉన్న అనుష్క నవ్వింది. 'నా భార్య చేసిన అందమైన హెయిర్​కట్' అని కోహ్లీ అనడంతో వీడియో ముగిసింది.

​హెయిర్‌ కట్‌కు ముందు, తర్వాత కోహ్లీ ఎలా ఉన్నాడో తెలిపే ఫొటోలు వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోకు పెద్ద సంఖ్యలో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. అనుష్క చేసిన హెయిర్‌స్టైల్‌ చూడ్డానికి బాగుందని అభిమానులు మెచ్చుకున్నారు.

అబ్బే.. ట్రిమ్మర్‌తో..

అబ్బే.. ట్రిమ్మర్‌తో..

అయితే చహల్ మాత్రం తనదైన శైలిలో ఈ వీడియో స్పందించాడు. ‘వదినా.. ట్రిమ్మర్‌తో గుండు కొట్టాల్సింది'అని హిందీలో కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. వాహ్వా..చహల్ భాయ్ కొందరంటే..సూపర్ కామెంట్ అని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు.

ఇక సాయం చేయరా?

ఇక సాయం చేయరా?

చాలా మంది మాత్రం కరోనాపై పోరాడటానికి మీ వంతు సాయం చేయండని సూచిస్తున్నారు. ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సురేశ్ రైనా, రహానే, ధావన్, సచిన్, గంగూలీ ఇలా వారికి తోచిన సాయం చేయగా.. కోహ్లీ, ధోనీ, రోహిత్ ఇంత వరకు ఎలాంటి విరాళం ప్రకటించలేదు. చహల్ కూడా ఎలాంటి సాయం చేయలేదు.

Story first published: Sunday, March 29, 2020, 18:04 [IST]
Other articles published on Mar 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+