
ఆఖరి ఓవర్.. అదిరే బౌలింగ్..
నాటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ పర్యవేక్షణలో వేసిన ఆ ఆఖరి ఓవర్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. అనంతరం నిలకడ కనబర్చలేకపోయిన జోగీందర్.. జట్టులో చోటుతో పాటు ఆటకు దూరమయ్యారు. ఇక 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే ఆదివారం జోగిందర్‌ను కొనియాడుతూ ఐసీసీ చేసిన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ముగ్దులు చేసింది. మరోసారి జోగిందర్ ఫైనల్ ప్రదర్శనను నెమరు వేసుకునేలా చేసింది.
ముల్తాన్ సుల్తాన్ సెహ్వాగ్.. అరుదైన రికార్డుతో పాటు ఆ వివాదానికి 16 ఏళ్లు.!!

సూపర్ పెర్ఫామెన్స్‌తో డీఎస్పీ ఉద్యోగం..
టీ20 ప్రపంచకప్ విజయంలో జోగిందర్ కీలక పాత్రను గుర్తించిన హర్యానా ప్రభుత్వం ఆ మెగా టోర్నీ అనంతరమే రాష్ట్ర పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరిటిండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఉద్యోగాన్ని కల్పించింది. దీంతో ప్రస్తుతం జోగిందర్ డీఎస్పీ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కరోనాను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ విధించగా.. జోగింధర్ హర్యానాలో పోలీస్ అధికారిగా గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రజలు బయటకు రాకుండా కరోనా బారిన పడకుండా రక్షణ కల్పిస్తున్నాడు.
సలాం జోగీంధర్ బాయ్..
ఈ నేపథ్యంలోనే తన ఫొటోను షేర్ చేసిన ఐసీసీ.. రియల్ వరల్డ్ హీరో అంటూ ట్వీట్ చేసింది. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో జోగిందర్ పోలీసుగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నట్లు కొనియాడింది. ‘2007 : T20 వరల్డ కప్ హీరో, 2020: రియ ల్ వరల్డ్ హీరో'నాటి, నేటి ఫోటోలను జతచేసింది. ఇక ఫ్యాన్స్ కూడా జోగిందర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అప్పుడు క్రికెట్ పిచ్ మీద కీలక సమయంలో రాణించిన ఈ క్రికెటర్ ఇప్పుడు ప్రాణాంతక కరోనా బారి నుంచి ప్రజల్ని కాపాడేందుకు మరో పిచ్ మీద బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాడని నెటిజన్లు కొనియాడుతున్నారు.
కరోనాపై పోరుకు బీసీసీఐ భారీ విరాళం

మా స్టైల్లో బుద్ది చెప్తాం..
ప్రాణాంతక వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించడం సవాల్‌తో కూడుకున్నదని క్రికెటర్ కమ్ డీఎస్పీ జోగిందర్ శర్మ తెలిపాడు. పీటీఐ వార్త సంస్థతో మాట్లాడుతూ... ‘2007 నుంచి నేను డీఎస్పీ హోదా కలిగి ఉన్నా. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించడం.. సవాల్‌తో కూడుకున్నది. ఇప్పటి వరకు నా పోలీస్ కెరీర్‌లో ఈ తరహా పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.
మా డ్యూటీ ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. పెట్రోలింగ్ చేస్తూ.. ప్రాణాంతక వైరస్ నిర్మూలనపై ప్రజలకు అవగాహనం కల్పిస్తాం. ఎలాంటి అవసరం లేకుండా బయటకు వచ్చినవారిని ఇళ్లకు పంపిస్తాం. అవసరమైన వారికి వైద్య సాయం చేస్తాం. లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారికి, సరైన కారణం లేకుండా బయటకు వచ్చిన వారిపై పోలీస్ స్టైల్లో యాక్షన్ తీసుకుంటాం'అని జోగింధర్ తెలిపాడు.
ఇక కరోనా కారణంగా మనదేశంలో ఇప్పటివరకు 21 మంది మరణించారు. ఈ ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటివరకు నాలుగు లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. సుమారు 22 వేలమంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.


Click it and Unblock the Notifications












