Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Badminton World Championships: సింధు, ఆయుష్, సాత్విక్ జోడీ ముందంజ.. లక్ష్యసేన్ ఔట్!

సొంతగడ్డపై జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దుమ్మురేపుతోంది. అద్వితీయమైన ప్రదర్శన‌తో ప్రీక్వార్టర్స్ దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో సింధు 21-16, 21-17తో కెనడా షట్లర్ వెన్ యు జాంగ్‌పై విజయం సాధించింది.

35 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో కెనడా అమ్మాయి నుంచి సింధుకు గట్టి పోటీ ఎదురైంది. ముఖ్యంగా తొలి గేమ్‌ను సింధు అతి కష్టం మీద గెలిచింది. 11-10తో వెన్ యు జాంగ్‌పై ఆధిక్యంలో ఉండగా.. జూలు విధిల్చిన సింధు వరుసగా 6 పాయింట్స్ సాధించింది. అదే ఊపులో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ వెన్ యు జాంగ్ గట్టి పోటీ ఇచ్చింది. ప్రిక్వార్టర్స్‌లో తొమ్మిదో సీడ్ సింధు.. చైనా ప్లేయర్ వాంగ్ జి యినితో తలపడనుంది.

మరోవైపు యువ షట్లర్ ఉన్నతి హుడా పోరాటం రెండో రౌండ్‌లో ముగిసింది. ఆమె 21-11, 9-21, 21-23తో కెనడా ప్లేయర్ మిచెలీ చేతిలో పోరాడి ఓడింది. ఆఖరి గేమ్‌లో 21-20తో మ్యాచ్ పాయింట్‌పై నిలిచి కూడా ఉన్నతి పుంజుకోలేకపోయింది.

Badminton World Championships 2026 PV Sindhu and Ayush Shetty Reach Pre-Quarterfinals Lakshya Sen Knocked Out

లక్ష్యసేన్ ఔట్..

టైటిల్ ఫేవరేట్లలో ఒకడైన లక్ష్య సేన్ తీవ్రంగా నిరాశపర్చాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో లక్ష్యసేన్ 21-19, 19-21, 17-21తో అమెరికా ప్లేయర్ గారెట్ టాన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి ఎంతో దూకుడుగా ఆడుతూ కోర్టులో ఎంతో వేగంగా కదిలిన టాన్‌ను అడ్డుకోవడం లక్ష్యకు కష్టమైంది. అతి కష్టం మీద తొలి గేమ్ గెలిచిన లక్ష్యసేన్.. తర్వాతి రెండు గేమ్స్‌లో తేలిపోయాడు.

మరో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఆయుష్ శెట్టి 21-8, 21-10 తేడాతో శ్రీలంక ప్లేయర్ దుమిందు అబేయ్‌విక్రమ్‌ను ఓడించి ప్రిక్వార్టర్స్ చేరాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో బై అందుకున్న స్టార్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలకు రెండో రౌండ్లోనూ కలిసొచ్చింది. ప్రత్యర్థి జోడీ అలెగ్జాండర్ డున్, ఆడమ్ ప్రింగిల్(స్కాట్లాండ్) వాకోవర్ ఇవ్వడంతో భారత్ ద్వయం నేరుగా ప్రిక్వార్టర్స్‌కు చేరింది. భారత్‌కు చెందిన మరో డబుల్స్ జోడీ హరిహరన్-ఎంఆర్ అర్జున్ రెండో రౌండ్‌లో 17-21,14-21 తేడాతో కాంగ్ మిన్ డాంగ్ జు(సౌత్ కొరియా) చేతిలో ఓడింది.

Story first published: Thursday, August 20, 2026, 9:39 [IST]
Other articles published on Aug 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+