IND vs SL: తొంటచెయి వాళ్లదే రాజ్యం.. టీమిండియాను గెలిపించిన లెఫ్టార్మ్ త్రయం!
శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా లెఫ్టార్మ్ ప్లేయర్లు ఆధిపత్యం చెలాయించారు. లెఫ్టార్మ్ బ్యాటర్లు అయిన దేవదత్ పడిక్కల్‌తో పాటు రిషభ్ పంత్, లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతమైన ఆటతీరుతో శ్రీలంక పతనాన్ని శాసించారు. ఈ ముగ్గురి అద్వితీయమైన ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 165 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. భారత్‌కు చెందిన ముగ్గురే కాదు.. శ్రీలంక లెఫ్టార్మ్ ఆటగాళ్లు కూడా సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో పూర్తిగా లెఫ్టార్మ్ ఆటగాళ్లదే హవా నడిచింది.
బ్యాటింగ్‌లో భారత లెఫ్టార్మ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులతో భారీ శతకంతో చెలరేగగా.. రెండో ఇన్నింగ్స్‌లో విలువైన 44 పరుగులతో విజయానికి బాటలు వేసాడు.రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ అద్భుతంగా ఆడి 69 బంతుల్లో 66 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన మానవ్ సుతార్.. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించాడు. ఈ ముగ్గురి అసాధారణ ప్రదర్శనతో భారత్ అద్భుత విజయాన్నందుకుంది.

శ్రీలంక జట్టులో కూడా లెఫ్టార్మ్ స్పిన్నర్లు రాణించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ప్రభాత్ జయసూర్య 8 వికెట్లు తీయగా..లెఫ్టార్మ్ బ్యాటర్ సోనాల్ దినూష తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.సాధారణంగా స్పిన్‌కు అనుకూలంగా ఉండే గాలే పిచ్‌పై బ్యాటింగ్ చేయడం ఎవరికైనా సవాలే. కానీ లెఫ్టార్మ్ బ్యాటర్లు ఈజీగా ఆడారు. ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం దేవదత్ పడిక్కల్‌ను ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పాడు.
పిచ్‌లో వేగవంతమైన టర్న్ లభించలేదని, దాంతో లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఆడటం ఈజీ అయిందని పేర్కొన్నాడు. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ గెలుపుతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మెరుగయ్యాయి. భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్ట్ ఆదివారం నుంచి కొలంబో వేదికగా ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
