కోహ్లీ నాకు దేవుడిచ్చిన అన్న.. నన్ను పూర్తిగా మార్చేసాడు: పీవీ సింధు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనకు అన్న లాంటివాడని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపారు. కోహ్లీ మాటలు తనను పూర్తిగా మార్చేసాయని చెప్పారు. ప్రస్తుతం పీవీ సిందు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ బరిలోకి దిగి శుభారంభం అందుకున్నారు. తాజాగా ఈ తెలుగు తేజం ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించారు.
'నాకు విరాట్ కోహ్లీ అన్నలాంటి వాడు.ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు సాయం చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లీని కలిసిన సందర్భం నాకింకా గుర్తుకుంది. కోహ్లీ చాలా ఓదార్పుగా మాట్లాడారు. 'ఇప్పుడేమైంది? నీ ఆట నువ్వు ఆడు. ఫలితాలు నీకు అనుకూలంగా రావడం మొదలవుతాయి. నీ సత్తా ఏంటో నీకు తెలుసు. చాలా బాగా శిక్షణ పొందిన ప్లేయర్‌వి. ప్రపంచానికి మరోసారి నీ సత్తా ఏంటో చాటిచెప్పు.'అని కోహ్లీ నాలో స్ఫూర్తి నింపారు.

ఆ సంభాషణ తర్వాత నా ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. నేను గెలిచిన ప్రతీ సారి ఆ సంతోషాన్ని కోహ్లీతో పంచుకున్నా. అతన్ని ఎప్పుడు కలిసినా చాలా సంతోషంగా అనిపించేది. జీవితంలో ఎంతో సాధించిన గొప్ప వ్యక్తి విరాట్ కోహ్లీ. ఆయన ఇచ్చే సూచనలు కూడా చాలా విలువైనవి.'అని సింధు చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సింధు శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 64 మ్యాచ్‌లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబుల్‌ను 21-7, 21-11 తేడాతో వరుస సెట్లలో సునాయసంగా చిత్తు చేసి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది. నేడు(బుధవారం) జరిగే రెండో రౌండ్‌లో 9వ సీడ్ పీవీ సింధు..కెనడాకు చెందిన 49వ ర్యాంక్ వెన్ యు జాంగ్‌తో తలపడనుంది. మధ్యాహ్నం 3.10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. జియో హాట్‌స్టార్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

