IND vs SL: శ్రీలంక బ్యాటర్‌ను రెచ్చగొట్టి ఔట్ చేసిన జైస్వాల్!(వీడియో)
భారత్, శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్లెడ్జింగ్‌తో శ్రీలంక బ్యాటర్‌ను ఔట్ చేశాడు. సిక్స్ కొడితే ఐపీఎల్ ఛాన్స్ ఇస్తానని బిగ్ షాట్ ఆడేలా ఉసిగొల్పాడు. అతని మాటలతో రెచ్చి పోయిన సదరు బ్యాటర్.. భారీ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఐదో రోజు ఆటలో శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 60వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నిరోషన్ డిక్‌వెల్లాను జైస్వాల్ తన మాటలతో ఉసిగొల్పాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యింది.

జైస్వాల్: తొలి ఇన్నింగ్స్‌లో చాలా షాట్స్ ఆడారు. ఈ ఇన్నింగ్స్‌లో కూడా మనం కొన్ని షాట్స్ చూడాలి.
డిక్‌వెల్లా: అవునా!
జైస్వాల్: అవును.. నేను బిగ్ షాట్స్ చూడాలనుకుంటున్నాను. స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడు.(చేతితో చూపిస్తూ..)
డిక్‌వెల్లా: అవసరం లేదు. నాకు ఆ సత్తా లేదు.
జైస్వాల్: షాట్స్ ఆడు.. నీకు ఆ సత్తా ఉంది.
డిక్‌వెల్లా: నన్ను ఐపీఎల్‌కు తీసుకెళ్లండి. అప్పుడు నేను బిగ్ షాట్స్ ఆడుతాను.
జైస్వాల్: కచ్చితంగా.. సిక్స్ కొట్టు.! 100 శాతం ఐపీఎల్‌కు తీసుకెళ్తాను.
ఆ కాసేపటికే ప్రసిధ్ కృష్ణ ఓవర్‌లో డిక్‌వెల్లా భారీ షాట్‌కు ప్రయత్నించి కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. 17 బంతుల్లో 10 పరుగులే చేశాడు. దాంతో తన వ్యూహం ఫలించిందని సహచర ఆటగాళ్లతో చెబుతూ జైస్వాల్ ఎగిరి గంతేసాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా 84/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్ 462 ఆలౌట్ (దేవదత్ పడిక్కల్ 167, కేఎల్ రాహుల్ 82, ప్రబాత్ జయసూర్య 4/109)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 284 ఆలౌట్( సొనాల్ దినుషా 100, నిరోషణ్ డిక్‌వెల్లా 80)
భారత్ రెండో ఇన్నింగ్స్ 193 ఆలౌట్(రిషభ్ పంత్ 66, దేవదత్ పడిక్కల్ 44)
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 206 ఆలౌట్ (ధనంజయ డిసిల్వా 59 , సోనాల్ దినుషా 84)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
