Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

US Open 2026 క్వీన్ రిబకినా.. రాకెట్ విరగ్గొట్టిన సబలెంకా!(వీడియో)

ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్ 2026‌‌లో వరల్డ్ నంబర్ వన్ ఎలెనా రిబకినా విజేతగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్, బెలారస్ ప్లేయర్ అరీనా సబలెంకాను ఓడించి మరీ టైటిల్ గెలుచుకుంది.

శనివారం అర్థరాత్రి జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో కజకిస్థాన్‌ ప్లేయర్ రిబకినా.. 6-4, 5-7, 6-2 తేడాతో సబలెంకాను ఓడించింది. దాంతో హ్యాట్రిక్ సాధించాలనే సబలెంకా ఆశలు అడియాశలయ్యాయి. 2024, 2025 ఎడిషన్లలో సబలెంకా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకుంది. అందుకు తగ్గట్లుగానే ఫైనల్ చేరింది. కానీ రిబకినా అడ్డుగా నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది.

US Open 2026: ఘాటైన గంజాయి వాసన.. మ్యాచ్‌ ఆపేసిన సబలెంకా!

US Open 2026: ఘాటైన గంజాయి వాసన.. మ్యాచ్‌ ఆపేసిన సబలెంకా!

రాకెట్ విరగ్గొట్టిన సబలెంకా..

తొలి సెట్‌ను 4-6తో కోల్పోయిన సబలెంకా.. రెండో సెట్‌ను 7-5తో గెలిచి రేసులోకి వచ్చింది. కానీ ఆఖరి సెట్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. రిబకినా అలవోకగా 6-2తో సెట్‌తో పాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ పరాజయంతో తీవ్ర అసహనానికి గురైన సబలెంకా.. తన రాకెట్‌ను విరగొట్టేసింది. ఆమెను కవర్ చేసేందుకు వెళ్లిన కెమెరామెన్‌పైనా పక్కకు దొబ్బేయ్ అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

US Open 2026 Aryna Sabalenka Smashes Racquet After Elena Rybakina Wins First Title

చేజారిన టాప్ ర్యాంక్..

ఈ టోర్నీ జరుగుతుండగానే సబలెంకాను వెనక్కి నెట్టి రిబకినా టాప్ ర్యాంక్‌ను అందుకుంది. సెప్టెంబర్ 14న ర్యాంకులను అధికారికంగా ప్రకటించనున్నారు. దాంతో 99 వారాల నుంచి తన వద్దే ఉన్న టాప్ ర్యాంక్ సబలెంకా నుంచి చేజారింది. దాంతో ఆమె మరింత ఆవెదనకు గురైంది. ఈ ఏడాది సబలెంకా ఒక్క మేజర్ టైటిల్ లేకుండానే ముగించింది.

Wimbledon 2026: ప్రిక్వార్టర్స్‌కు జకోవిచ్, సినర్, ఒసాకా.. మెద్వెదెవ్ ఔట్!

Also Read

Wimbledon 2026: ప్రిక్వార్టర్స్‌కు జకోవిచ్, సినర్, ఒసాకా.. మెద్వెదెవ్ ఔట్!

ఎలెనా రిబకినాకు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. ఒకే ఏడాది రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌తో పాటు నంబర్ వన్ ర్యాంక్‌ను అందుకున్న రెండో ప్లేయర్‌గా రిబకినా నిలిచింది. 1995లో స్టెఫీ గ్రాఫ్ ఈ ఘనతను అందుకుంది. 31 ఏళ్ల తర్వాత రిబకినా ఈ ఫీట్ సాధించింది.

Story first published: Sunday, September 13, 2026, 12:00 [IST]
Other articles published on Sep 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+