US Open 2026: ఘాటైన గంజాయి వాసన.. మ్యాచ్ ఆపేసిన సబలెంకా!
ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్ 2026లో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. ఘాటైన గంజాయి వాసన కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. వరల్డ్ నెంబర్ వన్ అరినా సబలెంకా, ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ కమిల్లా రఖిమోవా మధ్య శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
న్యూయార్క్‌లోని లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియం కోర్ట్‌లో జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా 3-0తో ఆధిక్యంలో నిలిచిన అరినా సబలెంకా తన రెండో సర్వీస్ చేసేందుకు సిద్దం కాగా.. మైదానంలోకి ఘాటైన గంజాయి వాసన వచ్చింది. ఈ వాసనతో అసౌకర్యానికి గురైన సబలెంకా వెంటనే.. సర్వీస్ చేయడం ఆపేసి అంపైర్‌కు ఫిర్యాదు చేసింది.
గంజాయి వాసన వస్తుంది..
అంపైర్ ఎవా అస్టెరాకి-మూర్‌తో.. 'ఎవరో గంజాయి తాగుతున్నారు. ఆ వాసన చాలా ఘాటుగా వస్తోంది. కొంచెం చూస్తారా?'అని తెలిపింది. న్యూయార్క్‌లో 21 ఏళ్లు పైబడిన వారికి గంజాయి తాగడం చట్టబద్దమైనప్పటికీ.. కోర్టు ఆవరణలో ధూమపానం చేయడానికి అనుమతి లేదు.

కాసేపు అంతరాయం తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభమైంది. సబలెంకా అద్భుతంగా ఆడి.. 35 నిమిషాల్లోనే తొలి సెట్‌ను గెలుచుకుంది. రెండో సెట్‌లో కమీలా రఖిమోవా గట్టి సవాల్ విసిరింది. అయితే సబలెంకా 10 ఏస్‌లు, 29 విన్నర్‌లు కొట్టి మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఆమె 5-4 వద్ద తన ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. చివరికి సబలెంకా 6-3, 6-4 తేడాతో వరుసగా సెట్లను గెలిచి ప్రీ క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
నాకు గట్టి పోటీ ఇచ్చింది..
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సబలెంకా తన ప్రత్యర్థి రఖిమోవాపై ప్రశంసల జల్లు కురిపించింది. ఈ 92వ ర్యాంకర్ తనకు గట్టి పోటీ ఇచ్చిందని కొనియాడింది. ప్రీక్వార్టర్‌లో సబలెంకా.. రష్యాకు చెందిన డయానా లేదా అమెరికాకు చెందిన టేలర్ టౌన్‌సెండ్‌లో ఒకరితో తలపడనుంది. తన నెంబర్ వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకోవాలంటే సబలెంకా ఈ టోర్నీలో విజేతగా నిలవాలి.
సబలెంకాతో పాటు మూడో సీడ్ జెస్సీకా పెగులా(అమెరికా), కోస్త్యుక్(ఉడ్రెయిన్) కూడా ప్రీక్వార్ట్స్ చేరారు. పెగులా 1-6, 6-4, 6-3తో లెలా ఫెర్నాండెజ్(కెనడా)పై విజయం సాధించింది. కోస్త్యుక్ 6-3, 6-2తో అలెగ్జాండ్రోవా(రష్యా)ను ఓడించింది. సోరానా కిర్‌స్టీ(రొమెనియా) 6-3, 6-3తో పావోలిని(ఇటలీపై)చిత్తు చేసింది. రెండో సీడ్ రిబకినా(కజకిస్తాన్) నాలుగో సీడ్ కొకో గాఫ్(అమెరికా) మూడో రౌండ్‌కు అర్హత సాధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


