Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wimbledon 2026: ప్రిక్వార్టర్స్‌కు జకోవిచ్, సినర్, ఒసాకా.. మెద్వెదెవ్ ఔట్!

వింబుల్డన్ గ్రాండ్‌స్టామ్ టోర్నీలో స్టార్ ఆటగాళ్లు నొవాక్ జకోవిచ్, యూనిక్ సినర్, నవోమి ఒసాకి దుమ్మురేపుతున్నారు. అద్వితీయమైన ప్రదర్శనతో ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ 7-5, 6-4, 1-6, 7-6(7-4) తేడాతో రిండర్‌నెచ్(ఫ్రాన్స్)పై విజయం సాధించాడు.

అందుకే వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఆలస్యం: బీసీసీఐ

అందుకే వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఆలస్యం: బీసీసీఐ

తొలి రెండు సెట్లను అలవోకగా గెలిచిన జకోవిచ్‌కు మూడో సెట్‌లో రిండర్‌నెచ్ నుంచి అనూహ్యమైన పోటీ ఎదురైంది. బలమైన సర్వీసులతో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. నాలుగో సెట్‌లోనూ అదే జోరును కొనసాగించినప్పటికీ.. టై బ్రేకర్‌లో గెలిచిన జకోవిచ్.. మ్యాచ్‌ను సొంతం చేసుకొని ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. ఈ విజయంతో వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రోజర్ ఫెదరర్‌ను జకోవిచ్ సమం చేశాడు.

Wimbledon 2026 Novak Djokovic and Jannik Sinner Power into Round of 16 Sabalenka Triumphs

మరో మ్యాచ్‌లో వరల్డ్‌ నెంబర్‌వన్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినర్‌ 6-4, 6-3, 6-4 తేడాతో అన్‌సీడెడ్‌ జెన్సన్‌ బ్రూక్స్‌బై (అమెరికా)ను ఓడించాడు. కాగా, ఎనిమిదో సీడ్ మెద్వెదేవ్‌ (రష్యా) 6-7, 6-7, 5-7తో స్ట్రఫ్‌ (జర్మనీ) చేతిలో చిత్తయ్యాడు ఈ పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఒసాకా జోరు..

మహిళల సింగిల్స్‌లో జపాన్ స్టార్ నవోమి ఒసాకా 6-1, 6-3 తేడాతో కసత్కినా(ఆస్ట్రేలియా)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. తొలి సెట్‌లో కేవలం ఒక్క గేమ్ మాత్రమే ప్రత్యర్థికి వదులుకున్న ఒసాకాకు తర్వాతి సెట్లో కాస్త పోటీ ఎదురైంది. కానీ 8వ గేమ్‌లో బ్రేక్ సాధించిన ఆమె.. అదే జోరుతో సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఒసాకా 5 ఏస్‌లు, 25 విన్నర్లు కొట్టింది.

ఆస్ట్రేలియా ఖేల్ ఖతమ్.. ప్రపంచకప్ నుంచి ఔట్!

ఆస్ట్రేలియా ఖేల్ ఖతమ్.. ప్రపంచకప్ నుంచి ఔట్!

ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్‌ సబలెంక (బెలారస్‌) 6-4, 6-4తో ఒస్టపెంకో (లాట్వియా)పై, పెగులా (అమెరికా) 6-1, 6-3తో బౌజాస్‌ (స్పెయిన్‌)పైగెలిచి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. ఇక, రిబకినా (కజకిస్థాన్‌) 6-1, 6-2తో మెక్‌నాలి (అమెరికా)పై గెలిచింది.

Story first published: Saturday, July 4, 2026, 10:33 [IST]
Other articles published on Jul 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+