Jay Meena: ఎవడీడు? క్రికెటర్ కాబోయి.. సాఫ్ట్ టెన్నిస్‌లో మెడల్ సాధించాడు!
జై మీనా.. భారత క్రీడా రంగంలో తన పేరు సువర్ణక్షరాలతో లిఖించుకున్నాడు. సాఫ్ట్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకం అందించి చరిత్ర సృష్టించాడు. గెలిచింది కాంస్యమే అయినా.. ఈ క్రీడలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడంతో టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాడు.
మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు చెందిన 26 ఏళ్ల జై మీనా చిన్నప్పుడు క్రికెటర్ కావాలనుకున్నాడు. కాన విధీ అతని సాఫ్ట్ టెన్నిస్ ప్లేయర్‌గా మార్చింది. బుధవారం జరిగిన పురుషుల వ్యక్తిగత విభాగంలో మీనా బ్రాంజ్ మెడల్ సాధించాడు.
సెమీస్‌లో ఓడినా..
క్వార్టర్ ఫైనల్లో ఫిలిప్పీన్స్ ఆటగాడిపై అద్భుతంగా పోరాడి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాడు. కానీ సెమీస్‌లో ఆతిథ్య జపాన్ ప్లేయర్ టకుయా కురోసాకా చేతిలో 4-2 తేడాతో ఓటిమిపాలయ్యాడు. 45 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మీనా ఓ దశలో పుంజుకున్నట్లే కనిపించాడు. కానీ ఆ తర్వాత వరుస సెట్లలో వెనుకబడి పరాజయం పాలయ్యాడు.

క్రికెటర్ అవ్వాలనుకుని..
చిన్నతనంలో క్రికెటర్ కావాలనుకున్న మీనా అనుకోకుండా సాఫ్ట్ టెన్నిస్ ప్లేయర్‌గా మారాడు. పయనీర్ పబ్లిక్ స్కూల్‌లో సాఫ్ట్ టెన్నిస్ ఆటను తొలిసారి చూసిన మీనా.. ఆసక్తితో కోర్టు వద్ద నిల్చుని ఆటను గమనించేవాడు. ఆ తర్వాత బాల్‌బాయ్‌గా మారాడు. అప్పుడే క్రికెటర్ కావాలని ఎన్నో కలలు కంటున్న అతన్ని ఈ ఆట ఎంతగానో ఆకట్టుకుంది.
బంతులను అందిస్తూ.. సాఫ్ట్ టెన్నిస్ ఆటను దగ్గరగా చూస్తూ క్రమంగా ఆసక్తి పెంచుకున్నాడు. 14 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయి బరిలోకి దిగాడు. చివరకు అదే ఆటను కెరీర్‌గా ఎంచుకొని ఇప్పుడు దేశం గర్వించేలా చేశాడు.
తృటిలో చేజారిన పతకం..
2022 ఆసియా క్రీడల్లో మీనా సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్ వరకు వెళ్లాడు. కానీ ఓడి తృటిలో సెమీస్ చేజార్చుకున్నాడు. ఈసారి మాత్రం సెమీస్‌కు చేరి పతకం ఖాయం చేసుకున్నాడు. ఈ ఆసియా గేమ్స్‌లో వ్యక్తిగత, మిక్స్‌డ్ ఈవెంట్లలో మెడల్ రౌండ్‌కు చేరిన ఏకైక భారత ఆటగాడిగానూ మీనా నిలిచాడు. మరో భారత ఆటగాడు ఆర్యన్ ఠాకూర్ గ్రూప్ దశలోనే వెనుదిరిగాడు.
నేషనల్స్ నుంచి ఇంటర్నేషనల్స్ వరకు ..
జై మీనా ప్రయాణం నేషనల్స్ నుంచి అంతర్జాతీయ వేదిక వరకు అంత ఈజీగా ఏం సాగలేదు. 2022లో గుజరాత్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం సాధించిన జైమీనా.. 2025లో జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ వరుసగా రికార్డులు నెలకొల్పాడు. 2024 ప్రపంచ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో ఆదియా తివారీతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యం సాధించి.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు.
ఆ తర్వాత 2025 ఆసియా సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో కాంస్యం సాధించి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆ టోర్నీలో సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల టీమ్, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో కలిపి నాలుగు పతకాలు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


