Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జపాన్ చేసిన పనికి సచిన్ టెండూల్కర్ ఫిదా.. హాట్సాఫ్ అంటూ ట్వీట్!

జపాన్ క్రికెట్ అసోసియేషన్‌పై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అభిమానుల కోసం జపాన్ చేసిన పని తనను విపరీతంగా ఆకట్టుకుందని కొనియాడాడు. భారత్‌కు గట్టి పోటీనిచ్చిన జపాన్ క్రికెట్‌ టీమ్ హ్యాట్సాఫ్ కూడా చెప్పాడు.

ఆసియా గేమ్స్ 2026కు ముందు ఇరు దేశాల దౌత్య సంబంధాలకు గుర్తుగా భారత్‌, జపాన్ ఏకైక టీ20 మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో 5 ఓవర్ల మ్యాచ్ సాధ్యమైంది. టెస్ట్ హోదా కలిగిన క్రికెట్ టీమ్‌తో జపాన్ ఆడటం ఇదే తొలిసారి. ఇతర క్రీడల్లో జపాన్‌కు తిరుగులేకున్నా.. క్రికెట్‌లో మాత్రం పసికూనే. ఆ దేశంలో క్రికెట్‌ను పెద్దగా పట్టించుకోరు.

IND vs JPN: భారత్‌ విజయంపై వివాదం.. అంపైర్ యూటర్న్‌పై దుమారం! (వీడియో)

IND vs JPN: భారత్‌ విజయంపై వివాదం.. అంపైర్ యూటర్న్‌పై దుమారం! (వీడియో)

హ్యాట్సాఫ్ జపాన్..

ఈ క్రమంలోనే భారత్‌తో జరిగిన తొలి టీ20కి హాజరైన జపాన్ అభిమానులకు క్రికెట్ నియమ నిబంధనలతో కూడిన ఒక బుక్‌లెట్ అందజేశారు. ఆటను మరింత బాగా అర్థం చేసుకోని ఆస్వాదించేందుకు ఇలా చేశారు. ఈ వినూత్న ప్రయత్నానికి సచిన్ ఫిదా అయ్యాడు. ఎక్స్ వేదికగా జపాన్ చేసిన పనిని ప్రత్యేకంగా కొనియాడాడు.

Sachin Tendulkar Hails Japan s Innovative Cricket Fan Guides Ahead of Asian Games 2026

'క్రికెట్ కొత్త ప్రదేశాలకు చేరడం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. భారత్-జపాన్ మ్యాచ్ జరగడమే ఒక ఎత్తైతే.. అక్కడికి వచ్చిన ప్రేక్షకులకి ఆట అర్థం కావడానికి క్రికెట్ రూల్స్ బుక్‌లెట్స్ పంచడం నన్ను నిజంగా ఆకట్టుకుంది. మనలో ప్రతి ఒక్కరికీ తొలిసారి క్రికెట్ చూసిన అనుభవం ఉండే ఉంటుంది. ఇప్పుడు మరికొంత మందికి ఆ అనుభవం దక్కుతుంటే చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ సవాలును స్వీకరించి, శక్తివంచన లేకుండా పోరాడిన జపాన్ టీమ్‌కి హాట్సాఫ్.

గట్టెక్కిన భారత్

ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో గట్టెక్కింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 32 పరుగులే చేసింది. శ్రేయస్ అయ్యర్(12 బంతుల్లో ఫోర్‌తో 16) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్(9), అభిషేక్ శర్మ(0), ఇషాన్ కిషన్(3) తీవ్రంగా నిరాశపర్చారు. జపాన్ బౌలర్లలో చార్లీ హరా-హింజ్2 వికెట్లు తీయగా.. ఇబ్రహీం తకాహషి, బెంజమిన్ ఇటో-డేవిస్ తలో వికెట్ తీసారు.

IND vs JPN: ఇషాన్ కిషన్ కళ్లు చెదిరే త్రో.. బిత్తరపోయిన జపాన్ బ్యాటర్!(వీడియో)

Also Read

IND vs JPN: ఇషాన్ కిషన్ కళ్లు చెదిరే త్రో.. బిత్తరపోయిన జపాన్ బ్యాటర్!(వీడియో)

అనంతరం జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లకు 30 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టు కెప్టెన్ కెండెల్(12 బంతుల్లో ఫోర్‌తో 12) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(2/13) రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(0/7), రవి బిష్ణోయ్(0/10) కట్టడిగా బౌలింగ్ చేశారు.

Story first published: Wednesday, September 23, 2026, 10:19 [IST]
Other articles published on Sep 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+