Asian Games 2026: ఈ పతకం ఒలింపిక్ మెడల్‌తో సమానం: మీరాబాయి చాను
గత దశాబ్ద కాలంగా తన కెరీర్‌లో లోటుగా ఉన్న ఆసియా గేమ్స్ మేడల్‌ను భారత దిగ్గజ వెయిట్‌లిఫ్టర్, ఒలింపిక్ రజత విజేత మీరాబాయి చాను ఎట్టకేలకు సొంతం చేసుకుంది. జపాన్‌లోని నాగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా గేమ్స్‌లో మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
స్నాచ్ విభాగంలో వరుసగా 83, 85, 87 కేజీలను విజయవంతంగా ఎత్తిన మీరాబాయి, క్లీన్ అండ్ జర్క్‌లో 107, 111 కేజీలను ఎత్తి మొత్తం 198 కేజీల బరువుతో రెండో స్థానంలో నిలిచింది. ఉత్తర కొరియా వెయిట్ లిఫ్టర్ రి సాంగ్ గమ్.. రికార్డ్ స్థాయిలో 215 కేజీలు(స్నాచ్‌లో 94 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 121 కిలోలు) ఎత్తి బంగారు పతకం సాధించింది. ఇండోనేషియాకు చెందిన విజయన లులుక్ డియాని ట్రి మొత్తం 191 కిలోల బరువుతో కాంస్య పతకం సొంతం చేసుకుంది.
28 ఏళ్ల నిరీక్షణకు తెర
ఈ విజయంతో ఆసియా క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో 28 ఏళ్ల పతక నిరీక్షణకు తెరపడింది. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కర్ణం మల్లేశ్వరి (63 కేజీలు) రజతం సాధించిన తర్వాత.. ఇన్నాళ్లకు మీరాబాయి పతకం సాధించింది చరిత్ర సృష్టించింది.

2014 ఇంచియాన్ ఆసియా గేమ్స్‌లో 9వ స్థానం, 2018లో గాయం వల్ల దూరం కావడం, 2023 హాంగ్‌జౌలో తృటిలో పతకం చేజారి తీవ్రంగా గాయపడటం వంటి చేదు జ్ఞాపకాలను తట్టుకుని ఆమె ఈ విజయం సాధించింది. ఈ విజయంపై మీరాభాయి చాను సంతోషం వ్యక్తం చేసింది. మైఖేల్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె.. ఇది ఒలింపిక్ మెడల్‌తో సమానమని పేర్కొంది.
ఒలింపిక్ మెడల్‌తో సమానం..
'నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది నేను ఎప్పటినుంచో కంటున్న ఆసియా గేమ్స్ పతకం కల. చివరికి రజతం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచినప్పుడు ఎంత సంతోషపడ్డానో.. ఇప్పుడు ఈ ఆసియా గేమ్స్ పతకం గెలిచినప్పుడు కూడా అంతే సంతోషంగా ఉన్నాను. నిజానికి నేను వెయిట్‌లిఫ్టింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఆసియా గేమ్స్‌లో ఒక పతకం సాధించాలనేదే నా ప్రధాన లక్ష్యం. ఈ రోజుతో ఆ కల నిజమైంది.
మీరాబాయికి ఈ ఆసియా గేమ్స్ పతకం కేవలం మరో సాధారణ మెడల్ మాత్రమే కాదు. వెయిట్‌లిఫ్టర్లకు ఈ టోర్నీ ఎంతో ప్రత్యేకం. వాస్తవానికి ప్రపంచంలోనే అత్యంత బలమైన వెయిట్‌లిఫ్టర్లు ఆసియా గేమ్స్‌లోనే పోటీపడతారు. చైనా, కొరియా, థాయిలాండ్, భారత్ లాంటి దేశాల్లో ప్రపంచ స్థాయి లిఫ్టర్లు ఉన్నారు. అందుకే మా దృష్టిలో ఆసియా గేమ్స్ పతకం సాధించడం ఒలింపిక్ పతకంతో సమానం. భారత వెయిట్‌లిఫ్టింగ్‌కు ఒలింపిక్ పతకాలు తక్కువగా ఉండొచ్చు. కానీ ఆసియా గేమ్స్‌లో పతకం గెలవడం కూడా అంతకంటే తక్కువేమీ కాదు. ఇదొక గొప్ప మైలురాయి'అని మీరాబాయి చాను చెప్పుకొచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


