Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Para Games 2026: స్వర్ణంతో మెరిసిన తెలంగాణ బిడ్డ!

ఆసియా పారా గేమ్స్‌ 2026లో తెలంగాణ బిడ్డ దీప్తి జివాంజి స్వర్ణంతో మెరిసింది. రెండో రోజు అయిన మంగళవారం పోటీల్లో దీప్తి జీవాంజి మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో పసిడి పతకం సాధించింది. ఈ రేసును దీప్తి 56.36 సెకన్లలో పూర్తి చేసి సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. గతంలో దీప్తి జీవాంజి పేరిటనే 56.59 సెకన్ల రికార్డ్‌ను మెరుగుపర్చుకుంది. జపాన్‌కు చెందిన కన్నావో నినా 58.92 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించగా.. కటో అకానె 1.00.26 సెకన్లతో బ్రాంజ్ మెడల్ గెలిచింది.

IND vs NZ: టీమిండియా సెలెక్షన్ గందరగోళంగా ఉంది.. ఆ ఇద్దరిని ఏం చేయాలనుకుంటున్నారు: హర్షా భోగ్లే

IND vs NZ: టీమిండియా సెలెక్షన్ గందరగోళంగా ఉంది.. ఆ ఇద్దరిని ఏం చేయాలనుకుంటున్నారు: హర్షా భోగ్లే

తెలంగాణ బిడ్డ..

తెలంగాణలోకి హనుమకొండ జిల్లాలోని కల్లూరు గ్రామానికి చెందిన దీప్తి జివాంజీది సాధారణ వ్యవసాయ కుటుంబం. మానసిక వైకల్యంతో పుట్టిన దీప్తి జివాంజీ కోచ్ రమేష్ సాయంతో పారా అథ్లెట్‌గా ఎదిగింది. ప్యారిస్ పారాలింపిక్స్ 2024‌లో కాంస్య పతకం సాధించి ఈ ఘనత సాధించిన భారత్ ప్లేయర్‌గా రికార్డ్ సాధించింది.

Telangana s Deepthi Jeevanji Creates History with 400m T20 Gold and Asian Para Games Record

ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం పతకం గెలిచిన దీప్తి జీవాంజి.. ఆసియా పారా గేమ్స్‌లో మరో స్వర్ణాన్ని అందుకుంది. అదే ప్రదర్శనను కొనసాగిస్తూ తాజా పారా ఆసియా గేమ్స్‌లో కూడా స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.


రెండో రోజు ఆరంభంలోనే 11 పతకాలు..

ఆసియా పారా గేమ్స్ రెండో రోజు భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. ఆరంభంలోనే 11 పతకాలను కైవసం చేసుకున్నారు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్‌53/54 ఫైనల్లో భారత్ అథ్లెట్లు ప్రదీప్ కుమార్, ఆయుష్ వర్మ సత్తా చాటారు. ప్రదీప్ కుమార్ 27.45 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్ సాధించగా.. ఆయుష్ వర్మ 17.88 మీటర్లతో బ్రాంజ్ మెడల్ నెగ్గాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఎస్‌హెచ్1 కేటగిరిలో మనీష్ నర్వాల్ 233.7 పాయింట్లతో సిల్వర్ మెడల్ సాధించాడు.

మహిళల క్లాస్ 3 టేబుల్ టెన్నిస్‌లో సోనాల్‌బెన్ పటేల్ బ్రాంజ్ మెడల్ సాధించింది. సెమీస్‌లో సౌత్ కొరియాకు చెందిన యూన్ జియు చేతిలో ఓటమిపాలైంది. భారత ఫ్లాగ్ బేరర్ భవినా పటేల్ మహిళల క్లాస్ 4-5 టేబుల్ టెన్నిస్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించింది.

IND vs NZ: వైభవ్ వాటర్ అందించాల్సిందే.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

Also Read

IND vs NZ: వైభవ్ వాటర్ అందించాల్సిందే.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

భారత్ 22 పతకాలు..

పురుషుల ఎఫ్11 షాట్‌పుల్‌లో ప్రవీణ్ శర్మ బ్రాంజ్ మెడల్ సాధించాడు. తన ఆరో ప్రయత్నంలో 13.86 మీటర్లు విసిరి ఈ పతకాన్ని అందుకున్నాడు. మహిళల స్టాండింగ్ పారా టేబుల్ టెన్నిస్‌లో భారత్ 2 కాంస్యాలు సాధించింది. సెమీస్‌లో చైనా ప్లేయర్ మావో జింగ్‌దిన్ చేతిలో బేబీ సహానా ఓటమి పాల్వగా.. మరో సెమీస్‌లో ఇరాక్ ప్లేయర్ నజల్లా చేతిలో ప్రాచి పాండే ఓడి కాంస్యాలను అందుకున్నారు. ప్రస్తుతం భారత్ 22 పతకాలతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యాలున్నాయి.

Story first published: Tuesday, October 20, 2026, 11:14 [IST]
Other articles published on Oct 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+