IND vs NZ: టీమిండియా సెలెక్షన్ గందరగోళంగా ఉంది.. ఆ ఇద్దరిని ఏం చేయాలనుకుంటున్నారు: హర్షా భోగ్లే
న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత టెస్ట్ టీమ్‌పై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ప్రశ్నలు సంధించాడు. మానవ్ సుతార్‌ను జట్టులోకి తీసుకోకపోవడంతో పాటు వాషింగ్టన్ సుందర్ పాత్ర గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ఇద్దరి విషయంలో సెలెక్టర్లు ఏం చేయాలనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నాడు.
సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటనకు భారత సెలెక్షన్ కమిటీ మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీ20 జట్టు, శుభ్‌మన్ గిల్ సారథ్యంలో వన్డే, టెస్ట్ టీమ్‌లను ప్రకటించింది. టెస్ట్ టీమ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ చివరి రెండు వన్డేల నుంచి సుదీర్ఘ ఫార్మాట్ ప్లేయర్లను తప్పించింది. ఈ రెండు వన్డేల్లో భారత జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించనున్నాడు.
పాపం మానవ్ సుతార్..
శ్రీలంక పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చిన మానవ్ సుతార్‌కు టెస్ట్ టీమ్‌లో చోటు దక్కలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన హర్షా భోగ్లే.. అతనికి సరైన వివరణ ఇవ్వాలని సెలెక్టర్లకు సూచించాడు. 'భారత టెస్ట్ టీమ్‌లో రెండు ఎంపికల గురించి నాకు స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం భారత జట్టులో ఫింగర్ స్పిన్నర్లలో మానవ్ సుతార్ టాప్ బౌలర్ అని అనడంలో సందేహం లేదు. శ్రీలంక పర్యటనలో కూడా అతనే ప్రధాన స్పిన్నర్‌గా బౌలింగ్ చేశాడు.

రవీంద్ర జడేజా బ్యాటింగ్ ఆల్‌రౌండర్. అతను ఐదో బౌలర్‌గానే జట్టులో ఉంటాడు. అయితే న్యూజిలాండ్ కండిషన్స్ మానవ్ సుతార్‌కు అనుకూలించకపోవచ్చు. నాలుగో పేసర్ గురించి నితీష్ రెడ్డిని ఆడించవచ్చు. అప్పుడు ఒకే ఒక్క స్పిన్నర్‌కు చోటు ఉంటుంది. అందుకే మానవ్ సుతార్ కంటే బెస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేసినట్లున్నారు.
కుల్దీప్‌ను ఏం చేస్తారో..?
కానీ ఎంతో కష్టపడి జట్టులోకి వచ్చి అసాధారణ ప్రదర్శన కనబర్చిన మానవ్ సుతార్ వంటి కుర్రాడికి సరైన వివరణ ఇవ్వాలి. అతన్ని భారత్-ఏ మ్యాచ్‌ల్లో ఆడిస్తున్నారు. మెరుగైన ప్రదర్శన చేసి తన సత్తా చాటుకుంటాడని ఆశిస్తున్నా. నేనైతే సుతార్‌ను జట్టులోనే కొనసాగించేవాడిని.
కుల్దీప్ యాదవ్‌ను ఆడించే విషయంలోనూ టీమ్‌మేనేజ్‌మెంట్ ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు. నితీష్ రెడ్డితో పాటు కుల్దీప్ యాదవ్‌కు మూడు ఫార్మాట్లలో అవకాశం కల్పించారు. కానీ న్యూజిలాండ్ కండిషన్స్‌లో ముగ్గురు పేసర్లతో ఆడాల్సి ఉంటుంది. నితీష్ రెడ్డి నాలుగో సీమర్‌గా ఆడవచ్చు. అతనికి బదులు రెండో స్పిన్నర్ కావాలనుకుంటే కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతాడు. అతన్ని 8వ స్థానంలో బ్యాటింగ్ చేయిస్తారా? లేక వాషింగ్టన్ సుందర్‌ను తీసుకుంటారా? అనేది చూడాలి.
సుందర్ పరిస్థితి ఏంటో..?
వాషింగ్టన్ సుందర్ విషయంలో కూడా ఇదే కన్‌ఫ్యూజన్ ఉంది. ఇప్పటికే అతన్ని పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి తప్పించి రెడ్ బాల్ ఫార్మాట్‌కు సిద్దం కావాలని చెప్పారు. కానీ అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందా? అనేది అనుమానమే. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల నుంచి పక్కనపెట్టి టెస్ట్‌ల్లో కూడా ఆడించకపోతే అతనికి నిరాశే మిగులుతుంది.
రిషభ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ఆడితే.. జడేజా, నితీష్, వాషింగ్టన్ సుందర్‌లతో ఆడించవచ్చు. అప్పుడు భారత జట్టుకు ఆరో బౌలింగ్ ఆప్షన్ లభిస్తుంది. కానీ ఆరుగురు బౌలర్లు అవసరమా? అనేది ప్రశ్న. ఏది ఏమైనా వాషింగ్టన్ సుందర్‌ను ఆడిస్తారా? లేదా? అనేది కాస్త ఆందోళన కలిగించే విషయమే.'అని హర్షా భోగ్లే పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


