IND vs NZ: వైభవ్ వాటర్ అందించాల్సిందే.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!
వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను సమం చేసుకున్న భారత్.. న్యూజిలాండ్ పర్యటనకు సిద్దమైంది. శనివారం వెస్టిండీస్‌తో ఆఖరి టీ20 రద్దయిన 24 గంటల వ్యవధిలోనే శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టు న్యూజిలాండ్ ఫ్లైట్ ఎక్కింది.
నెల 10 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్ట్‌ల సిరీస్‌లను ఆడనుంది. అక్టోబర్ 22న క్రిస్ట్‌చర్చ్ వేదికగా జరిగే తొలి టీ20తో ఈ పర్యటనకు తెరలేవనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12.30 గంటలకు మొదలవ్వనుంది.
వైభవ్‌కు నిరాశే..
ఈ పర్యటనలో కూడా వైభవ్ సూర్యవంశీకి నిరాశే ఎదురవ్వనుంది. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో వైభవ్‌కు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. న్యూజిలాండ్ పర్యటనలో కూడా అదే రిపీట్ కానుంది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మలో ఎవరైన గాయపడితే తప్పా వైభవ్‌కు చోటిచ్చే అవకాశం లేదు.

వెస్టిండీస్‌తో ఆఖరి టీ20 వర్షంతో రద్దయిన అనంతరం శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే చెప్పాడు. వైభవ్ తన అవకాశం కోసం ఎదురు చూడాల్సిందేనని స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే వైభవ్ తొలి టీ20 ఆడే అవకాశం లేదు. టీమిండియా కాంబినేషన్‌లో కూడా పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.
భువీ రీఎంట్రీ..
ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు ఆడనున్నారు. ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఆడనుండగా.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ ఇద్దరూ ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా లేని లోటును తీర్చలేకపోయారు. నమన్ ధీర్, అక్షర్ పటేల్ తమ స్థానాలను నిలబెట్టుకోనున్నారు.
సుమారు నాలుగేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్.. పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. వెస్టిండీస్‌తో ఐదో టీ20తోనే అతను రీఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా.. వర్షం కారణంగా సాధ్యం కాలేదు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గత న్యూజిలాండ్ పర్యటన తర్వాత భువీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ప్రిన్స్ యాదవ్ మూడో పేసర్‌గా బరిలోకి దిగనున్నాడు.
న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే:
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.
భారత టీ20 టీమ్:
శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


