Asian Para Games: సర్టిఫికేట్ ఇవ్వకుండా అధికారులు వేధించారు: డబుల్ గోల్డ్ మెడలిస్ట్ సిమ్రాన్ శర్మ
ఆసియా పారా గేమ్స్ 2026లో రెండు గోల్డ్ మెడల్స్‌తో మెరిసిన భారత అథ్లెట్ సిమ్రాన్ శర్మ సాయ్(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులపై సంచలన ఆరోపణలు చేసింది. ఆసియా పారా గేమ్స్‌కు పంపించేందుకు అదనపు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కావాలని సాయ్ అధికారులు వేధించారని తెలిపింది.
దృష్టి లోపం ఉన్న ఈ అథ్లెటిక్స్ ఛాంపియన్ జపాన్ వేదికగా జరిగిన పారా ఆసియా గేమ్స్‌లో మహిళల 200 మీటర్ల టీ12, 100 మీటర్ల టీ12 విభాగాల్లో స్వర్ణాలు సాధించింది. 100 మీటర్ల రేసును 12.02 సెకన్లలోనే పూర్తి చేసి వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన సిమ్రాన్ శర్మ 200 మీటర్ల రేసును 24.95 సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకాన్ని అందుకుంది.
ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వలేదు..
తాజాగా హిందూస్థాన్ టైమ్స్‌తో మాట్లాడిన సిమ్రాన్ శర్మ.. జపాన్‌కు వెళ్లే ముందు సాయ్ ఫిట్‌నెస్ సెంటర్ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందే ప్రయత్నంలో తాను అనవసరమైన అడ్డంకులను ఎదుర్కొన్నానని పేర్కొంది.
'సాయ్ అధికారులు నాకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించారు. అదనపు లెటర్ పట్టుకురావాలని సూచించారు. ఆ లెటర్ ఉంటే తప్ప ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. చివరకు నేను వేరే చోట ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి వచ్చింది. దేశం తరఫున ఆడటానికి వెళ్లున్నారని తెలిసి కూడా అధికారులు ఎందుకు అంతలా విసిగిస్తారు?'అని సిమ్రాన్ శర్మ ఆవేదన వ్యక్తం చేసింది.

జాతీయ శిక్షణ కేంద్రంలో టాప్ పారా అథ్లెట్ల పట్ల అధికారుల ప్రవర్తన ఎలా ఉంటుందనేది ఈ ఘటన ఎత్తిచూపుతోంది. సిమ్రాన్ శర్మ వ్యాఖ్యలతో సాయ్ అధికారులపై విమర్శలు తలెత్తుతున్నాయి.
సాయ్ వివరణ..
మరోవైపు సిమ్రాన్ శర్మ ఆరోపణలపై సాయ్ స్పందించింది. ఆధారాలు ఉంటే పరిశీలిస్తామని తెలిపింది. ఈ వివాదానికి సిమ్రాన్ భర్త, పారా-అథ్లెటిక్స్ కోచ్ గజేంద్ర సింగ్ కారణమని పేర్కొంది.
జేఎల్‌ఎన్ హాస్టల్‌లో ఉంటున్న గజేంద్ర.. జూన్ 20 నుంచి సెప్టెంబర్ 20 మధ్య కాలంలో హాస్టల్ జిమ్‌ను లెఫ్టినెంట్ జనరల్ ముకేష్ కుమార్ చద్దా వాడుకునేందుకు ఆగస్ట్ 19న అనుమతి కోరారని సాయ్ తెలిపింది. ఈ అనుమతి సమయం దాటాక అభ్యర్థించడమే కాకుండా.. ముందస్తు అనుమతికి సంబంధించిన రికార్డులు లేవని స్పష్టం చేసింది.
భర్త సహకారంతో..
డబుల్ గోల్డ్ మెడలిస్ట్ అయిన సిమ్రాన్ శర్మ వెనుక పుట్టెడు దు:ఖం ఉంది. సిమ్రాన్ నెలలు నిండకుండానే పుట్టింది. ఆరున్నర నెలలకే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చింది. పుట్టకతోనే ఆమెకు దృష్టిలోపం వచ్చింది. తన భర్త గజేంద్ర సింగ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సిమ్రాన్.. ఆయన కోచింగ్‌లోనూ అథ్లెట్‌గా ఎదిగింది. ఆర్మీ ఆఫీసర్ అయిన గజేంద్ర సింగ్.. జాతీయ స్థాయిలో అథ్లెట్‌గా రాణించాలని కలలు కన్నాడు. కానీ అతని కల నెరవేరకపోవడంతో ట్రైనర్‌గా మారాలనుకున్నాడు.
ఈ క్రమంలోనే 2015లో సిమ్రాన్ శర్మ పరిచయమైంది. ఈ పరియయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లికి గజేంద్ర సింగ్ కుటుంబం నిరాకరించింది. అయినా తన కుటుంబాన్ని ఎదురించి 2017లో పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలకు దూరంగా ఉన్న ఈ ఇద్దరూ.. తమ లక్ష్యం వైపు అడుగులు వేసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


