Asian Para Games 2026: సెంచరీ కొట్టిన భారత్!
ఆసియా పారా గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే పతకాల సంఖ్యను 100 దాటించారు. ఐదో రోజు భారత అథ్లెట్లు ప్రపంచ రికార్డులతో పాటు స్వర్ణ పతకాలు అందుకున్నారు. షూటింగ్‌లో మోనా అగర్వాల్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణం సాధించింది.
శుక్రవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఎస్‌హెచ్1 విభాగంలో 357.5 స్కోరుతో వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన మోనా అగర్వాల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ ఆసియా పారా గేమ్స్‌లో ఆమెకు ఇది రెండో స్వర్ణం కావడం గమనార్హం. చైనా ప్లేయర్ కుయిపింగ్ జాంగ్‌పై 3.8 పాయింట్ల భారీ తేడాతో మోనా విజయం సాధించింది.

మరోవైపు అథ్లెటిక్స్‌లోనూ భారత హవా కొనసాగింది. టీ44 400 మీటర్ల స్ప్రింట్‌లో సందీప్ కుమార్ కేవలం 52.28 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి వరల్డ్ రికార్డుతో పాటు పసిడి పతకాన్ని సాధించాడు. ఈ పతకంతోనే భారత్ పతకాల సంఖ్య సెంచరీ దాటింది. ఇదే ఈవెంట్‌లో అజయ్ కుమార్ 53.61 సెకన్లతో బ్రాంజ్ మెడల్ సాధించాడు.
పురుషుల టీ46 1500 మీటర్ల విభాగంలో ప్రమోద్ 4 నిమిషాల 9.65 సెకన్లలో రేసును పూర్తి చేసి రజత పతకం అందుకున్నాడు. శ్రీలంకకు చెందిన పువాక్‌పిటికండె 4 నిమిషాల 3.25 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం ఎగరేసుకుపోయాడు.
జావెలిన్ త్రో ఎఫ్37 విభాగంలో హనీ తన చివరి ప్రయత్నంలో 60.49 మీటర్లు విసిరి వరల్డ్ రికార్డ్ నెలకొల్పి పసిడి పతకాన్ని ముద్దాడాడు. ఇతర క్రీడల్లోనూ భారత్ జోరు కొనసాగింది. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3 బ్యాడ్మింటన్ ఆల్-ఇండియన్ ఫైనల్లో ప్రమోద్ భగత్‌ను ఓడించి నితేష్ కుమార్ పసిడి సాధించాడు. ప్రమోద్ భగత్‌కు రజతం దక్కింది.
ఎస్‌ఎల్ 4 విభాగంలో నవీన్ శివకుమార్ 21-9, 21-17 తేడాతో ఇండోనేషియా ప్లేయర్ ఫెర్డీపై విజయం సాధించి స్వర్ణం గెలవగా.. మహిళల సింగిల్స్ ఎస్‌యూ5 విభాగంలో తులసిమతి మురగేశన్‌కు రజతం దక్కింది. ఫైనల్లో ఆమె చైనా ప్లేయర్ యాంగ్ చేతిలో 18-21, 11-21 తేడాతో ఓటమిపాలైంది.
పారా ఆర్చరీ పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో హర్విందర్ సింగ్, విజయ్ సుండి ద్వయం 5-1 తేడాతో చైనాపై గెలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం భారత్ గెలిచిన తొలి బంగారు పతకం ఇదే కావడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


