Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2011 ప్రపంచకప్‌ను అమ్ముకున్నాం.. శ్రీలంక మాజీ క్రీడామంత్రి సంచలన వ్యాఖ్యలు

Former Sports Minister Says Sri Lanka Sold 2011 Cricket World Cup Final

కొలంబో: 2011 ప్రపంచకప్ ఫైనల్‌‌పై శ్రీలంక మాజీ క్రీడాశాఖ మంత్రి మహీందానంద అలుత్గామాగే సంచలన ఆరోపణలు చేశారు. భారత జట్టుకు తమ దేశం ప్రపంచకప్‌ను అమ్ముకుందని, అందులో భాగంగానే ఫైనల్లో శ్రీలంక ఓడిందని ఆరోపించారు. 2010 నుంచి 2015 వరకు శ్రీలంక కేంద్ర క్రీడాశాఖ మంత్రిగా చేసిన మహీందానంద.. తాజాగా ఆ దేశ సిరాస టీవీతో మాట్లాడుతూ 2011 ప్రపంచకప్ ఫైనల్లో ఫిక్సింగ్ జరిగిందన్నాడు.

నేను చెప్పేది నిజం..

నేను చెప్పేది నిజం..

‘భారత్-శ్రీలంక మధ్య జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ అయింది. ఆమ్యాచ్‌లో శ్రీలంక భారత్‌కు అమ్ముడుబోయింది. నేను క్రీడాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఇది జరిగింది. ఇన్నాళ్లు దేశం మేలు కోసం ఈ విషయం చెప్పలేదు. కానీ ఇప్పుడు నా బాధ్యతగా ఈ విషయాన్ని బయటపెడుతున్నా. నాటి ఫైనల్లో శ్రీలంక గెలిచేది. కానీ ఆ మ్యాచ్‌ను ఫిక్స్ చేసుకున్నారు. నేనేం చెబుతాన్నానో దానికి కట్టుబడి ఉంటా. ప్రస్తుతం నేను ఏ ఆటగాడితో టచ్‌లో లేను. కానీ జట్టులో కొంతమంది ఫిక్సింగ్‌కు సహకరించారు.' అని ప్రస్తుతం ఎంపీగా ఉన్న మహీందానంద ఆరోపించారు.

అందుకే కెప్టెన్‌గా సచిన్ విఫలమయ్యాడు: భారత మాజీ కోచ్

అర్జున్ రణతుంగ అనుమానం..

అర్జున్ రణతుంగ అనుమానం..

ఇక మూడేళ్ల క్రితం శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కూడా 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ అయిందని ఆరోపించాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ ఫైనల్లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడం తనను విస్మయపరిచిందని ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియోలో పేర్కొన్నాడు. ‘అప్పుడు నేను వ్యాఖ్యాతగా భారత్‌లోనే ఉన్నాను. ఆ ఓటమి నన్నెంతో వేదనకు గురిచేసింది. ఆ పరాజయంపై అప్పట్లోనే నాకు అనుమానం ఏర్పడింది. 2011 ఫైనల్లో శ్రీలంక ఆడిన తీరుపై మనం విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అన్ని విషయాలు నేను వెల్లడించలేను. కానీ ఏదో ఒకరోజు వాటిని బయటపెడతాను'అని అప్పట్లో రణతుంగ వ్యాఖ్యానించాడు.

మీడియా కూడా..

మీడియా కూడా..

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 274/6 స్కోరు చేసింది. అనంతరం భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సెహ్వాగ్‌ (0), సచిన్‌ (18)లను తక్కువ పరుగులకే అవుట్‌ చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా శ్రీలంక బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌ పేలవంగా మారింది. గౌతమ్ గంభీర్ అద్భుత పోరాటానికి.. ధోనీ ధాన్ ధన్ ఇన్నింగ్స్ తోడవడంతో టీమిండియా విజయం సాధించింది. శ్రీలంక స్థానిక మీడియా అప్పట్లోనే ఆ మ్యాచ్‌ ఓటమిపై అనుమానాలు వ్యక్తంజేసింది. కానీ ఎవరూ అంతగా పట్టించుకోలేదు.

పనికిమాలిన ఆరోపణలు

పనికిమాలిన ఆరోపణలు

రణతుంగ ఆరోపణలు పనికిమాలినవిగా నాటి వరల్డ్‌కప్‌ భారత జట్టు సభ్యులు గౌతమ్‌ గంభీర్‌, ఆశీష్‌ నెహ్రా అప్పట్లో కొట్టిపారేశారు. అతడి ఆరోపణలకు ఆధారాలు చూపాలని సవాల్‌ కూడా విసిరారు. ‘రణతుం గ ఆరోపణలు నన్ను ఆశ్చర్యపరిచాయి. తన ఆరోప ణలకు మద్దుతుగా ఆయన ఆధారాలు చూపాలి'అని ఆ ఫైనల్లో 97 పరుగులతో భారత్‌ టాప్‌ స్కోరర్‌ గంభీర్‌ ప్రశ్నించాడు. ఇక ఇలాంటి ఆరోపణలకు పెద్దగా ప్రాధాన్యమివ్వాల్సిన అవసరంలేదని నాటి భారత జట్టు సభ్యుడు నెహ్రా అన్నాడు.

క్రికెట్‌లో మరో కొత్త ఫార్మాట్.. మూడు జట్లతో 36 ఓవర్ల మ్యాచ్!

Story first published: Thursday, June 18, 2020, 17:18 [IST]
Other articles published on Jun 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+