Asian Games 2026: ఇవి పతకాలు కాదు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ
ఆసియా గేమ్స్ 2026లో పతకాలు సాధించిన అథ్లెట్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. వారు సాధించిన ఈ పతకాలు కేవలం అంకెలకు మాత్రమే పరిమితం కాదని, క్రీడా రంగంలో భారత శక్తికి ప్రతీకలని తెలిపారు. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లను గురువారం ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ప్రధాని మోదీ సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అథ్లెట్లను ప్రత్యేకంగా అభినందించారు. వారు సాధించిన విజయాలు దేశంలో 140 కోట్ల మంది ప్రజలందరివని మోదీ స్పష్టం చేశారు. 'మన అథ్లెట్లు సాధించిన ఈ పతకాలు కేవలం అంకెలు మాత్రమే కాదు. ఇవి ఒక నూతన భారత క్రీడా శక్తికి ప్రతీక. విశ్వ వేదికలపై మన దేశ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరవేయడమే అత్యున్నత విజయం. ఆసియా గేమ్స్‌లో మహిళా అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు.

మన మహిళా సోదరిమణులు ఏకంగా 11 స్వర్ణాలతో కలిపి మొత్తం 38 పతకాలను సాధించడం గొప్ప విషయం. విజేతగా నిలిచిన క్రికెట్, హాకీ టీమ్స్‌తో పాటు ఐదు స్వర్ణ పతకాలు సాధించిన ఆర్చరీ క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు. దేశ క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఈ విజేతలు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వేదికలపై మరింతగా రాణించి దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలి.'అని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా యువ అథ్లెట్లు ప్రధానికి తమ సంతకం చేసిన జెర్సీలు అందజేయగా.. 17 ఏళ్ల ఆర్చరీ ప్లేయర్ కుంకుమ్ మోహోద్ విల్లును జ్ఞాపికగా బహుకరించారు. జపాన్ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్ 2026 టోర్నీలో భారత్ 21 స్వర్ణాలతో సహా మొత్తం 85 పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.
మెడల్స్ టేబుల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. డ్రాగన్ కంట్రీ చైనా 169 బంగారు పతకాలతో మొత్తం 341 మెడల్స్ గెలిచి అగ్రస్థానంలో నిలవగా.. ఆతిథ్య జపాన్ 83 స్వర్ణాలతో మొత్తం 269 పతకాలతో రెండో స్తానాన్ని కైవసం చేసుకుంది. సౌత్ కొరియా 39 స్వర్ణాలతో సహా 150 మెడల్స్‌తో మూడో స్థానంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


