IND vs WI: అయ్యర్, గంభీర్‌కు కామన్సెన్స్ లేదు: అశ్విన్
వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో టీమిండియా ఓడిపోవడంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వికెట్ టేకర్ అయిన కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టడాన్ని తప్పుబట్టాడు. రిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
బుధవారం ఉప్పల్ వేదికగా ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. ఈ ఫలితంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. గంభీర్, శ్రేయస్ అయ్యర్‌పై విమర్శలు గుప్పించాడు. కామన్సెన్స్ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కుల్దీప్ యాదవ్‌ను ఆడించి ఉంటే వెస్టిండీస్ 20 పరుగులు తక్కువగా చేసేదన్నాడు.

'కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే సాధారణంగా బౌన్స్ ఉండే వికెట్లు స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించవు. కానీ కుల్దీప్ యాదవ్ గూగ్లీ, లెగ్ స్పిన్‌ను అంచనా వేయడంలో వెస్టిండీస్ బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. అయినా అతన్ని పక్కనపెట్టడం చూస్తుంటే మేనేజ్మెంట్కు కనీస కామెన్ సెన్స్ లేదనిపిస్తోంది. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ జట్టులో ఉండి ఉంటే వెస్టిండీస్ 15-20 పరుగులు తక్కువ చేసేది.
ఇండోర్‌లో కుల్దీప్ యాదవ్‌ను ఆడించకపోవడాన్ని నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఆ మైదానం చిన్నది. కాబట్టి ఆ నిర్ణయాన్ని ఇప్పటికీ సమర్థిస్తాను. కానీ రాంచీలో భారత్ ఓటమికి కుల్దీప్ యాదవే కారణం అంటే మాత్రం నేను అంగీకరించను. కుల్దీప్ యాదవ్‌ను ఒక సమస్యగా మారుస్తున్నారు. ఇది చాలా తప్పు.'అని అశ్విన్ పేర్కొన్నాడు.
ఈ ఐదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ యాదవ్.. వరుసగా 2/33, 1/53 ప్రదర్శనతో మూడు వికెట్లు పడగొట్టాడు. రెండో టీ20లో భారత్ 250 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. వన్డే సిరీస్‌లో మాత్రం కుల్దీప్ యాదవ్ 4/40, 2/65 గేమ్ ఛేజింగ్ స్పెల్స్ వేసాడు. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో చివరి మ్యాచ్ శనివారం బెంగళూరు వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


