ఫుల్‌టాస్‌లు వేసి పిచ్‌ను అంటే ఎలా? భారత బౌలర్లపై గవాస్కర్ ఫైర్!
వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో టీమిండియా ఓటమికి పిచ్‌ను ఏ మాత్రం నిందించవద్దని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. భారత బౌలర్లు తమ పేలవ బౌలింగ్ ప్రదర్శనపై ఆత్మపరిశీలన చేసుకోవాలని చురకలంటించాడు. బుధవారం ఉప్పల్ స్టేడియంలో ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.
ఈ ఫలితంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. షై హోప్ (50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 నాటౌట్) విధ్వంసకర శతకంతో సత్తా చాటాడు. అనంతరం భారత్ మాత్రం 19.3 ఓవర్లలో 223 పరుగులకే పరిమితమైంది. ఈ ఓటమికి భిన్నమైన ఉప్పల్ పిచ్ కారణమనే విమర్శలు వినిపించాయి. గౌతమ్ గంభీర్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఫ్లాట్ వికెట్స్‌పై తరుచూ విమర్శలు గుప్పిస్తున్నాడు.
ఫుల్‌టాస్‌లు వేసి పిచ్‌ను అంటే ఎలా?
సునీల్ గవాస్కర్ మాత్రం భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇరు జట్లు ఒకే రకమైన వికెట్‌పై ఆడినప్పుడు పిచ్‌ను నిందించడం ఏంటని ప్రశ్నించాడు. నాలుగో టీ20లో భారత బౌలర్లు ఫుల్‌టాస్‌లు వేసి మూల్యం చెల్లించుకున్నారని అభిప్రాయపడ్డాడు. 'బౌలర్లకు పిచ్ అనుకూలంగా లేదని చాలా మంది నిందిస్తున్నారు. కానీ బౌలర్లు ఫుల్ టాస్‌లు వేసి మూల్యం చెల్లించుకుంటే పిచ్ ఎలా బాధ్యత వహిస్తుంది.

బౌలర్ల పేలవమైన బౌలింగ్‌కు పిచ్‌ను నిందించడం సరికాదు. తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఆడినప్పుడు వెస్టిండీస్ ఆటగాళ్లు కూడా ఇలానే ఫుల్‌టాస్‌లు వేసారు. కానీ చివరి దశల్లో పిచ్‌ను సరిగ్గా రీడ్ చేసి సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేశారు. కచ్చితత్వంతో కూడా యార్కర్లను సంధించారు. దానివల్లే వారికి వికెట్లు పడ్డాయి. బౌలర్లు పిచ్‌కు తగ్గట్లు బౌలింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.'అని గవాస్కర్ సూచించాడు.
ఇదేం క్రీడాస్ఫూర్తి..?
వెస్టిండీస్ యువ పేసర్ షమర్ జోసెఫ్‌పై సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వికెట్లకు బదులు బ్యాటర్‌ను లక్ష్యంగా చేసుకోవడం ఏంటని అసహనం వ్యక్తం చేశాడు. ఆఖరి ఓవర్లో షమర్ జోసెఫ్ వేసిన బౌన్సర్ అర్ష్‌దీప్ సింగ్ భుజానికి బలంగా తాకింది. దాంతో అతను నొప్పితో విలవిలలాడాడు.
తర్వాతి బంతిని కూడా అర్ష్‌దీప్ సింగ్ భుజమే లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేసాడు. ఇది గమనించిన గవాస్కర్.. లైవ్‌లోనే జోసెఫ్ తీరును తప్పుబట్టాడు. 'అతను బ్యాటర్‌నే లక్ష్యంగా చేసుకున్నాడు. అక్కడ పడగొట్టడానికి స్టంప్స్ ఉన్నప్పుడు.. బ్యాటర్‌పై దాడి చేయాల్సిన అవసరం ఏం ఉంది?'అని గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దాంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే భారత్ తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. అర్ష్‌దీప్ సింగ్ రిటైర్డ్ హర్ట్‌గా ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


