ఆసియా గేమ్స్ షురూ.. కిట్ ఆలస్యంతో మారిన భారత ఫ్లాగ్‌బేరర్!
ఆసియా గేమ్స్ 2026 ఘనంగా మొదలయ్యాయి. అయితే ఈ ప్రారంభ వేడుకల్లో భారత ఫ్లాగ్-బేరర్ చివరి నిమిషంలో మారిపోయారు. కబడ్డీ స్టార్ పవన్ సహ్రావత్ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించాడు. వాస్తవానికి షాట్‌పుటర్ తజిందర్ పాల్ సింగ్ తూర్.. పతకదారిగా వ్యవహరించాల్సింది. కానీ అతని కిట్ ఆలస్యం కావడంతో చివరి నిమిషంలో ఫ్లాగ్ బేరర్‌ను మార్చారు.
జెర్సీ సహా ఇతర క్రీడా వస్తువులు ఉండే అధికారిక కిట్ తజిందర్‌కు అందుకపోవడం వల్ల అతను ఆసియా క్రీడల ఆరంభోత్సవ వేడుకలకు హాజరు కాలేదు. దాంతో పవన్ సెహ్రావత్, స్టార్ షూటర్ మనుబాకర్‌తో కలిసి భారత బృందానికి నాయకత్వం వహించాడు. గత ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన భారత కబడ్డీ జట్టులో 30 ఏళ్ల పవన్ సహ్రావత్ సభ్యుడిగా ఉన్నాడు.

30 క్రీడలు.. 503 మది అథ్లెట్లు..
ఈ 20వ ఆసియా గేమ్స్ జపాన్‌లో నగోయా నగరంలో అట్టహాసంగా మొదలయ్యాయి. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. 45 దేశాల క్రీడాకారులు ఈ గేమ్స్‌లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి 30కి పైగా క్రీడల్లో 503 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతుతన్నారు.
2022లో చైనాలో జరిగిన ఆసియా గేమ్స్ పతకాల పట్టికలో భారత్ 28 స్వర్ణాలతో నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తంగా 106 మెడల్స్ సాధించింది. ఈ సారి కూడా అదే తరహా ప్రదర్శన కనబర్చాలనే పట్టుదలతో భారత్ ఉంది.
తెలుగు సైన్యం ఇదే
బ్యాడ్మింటన్
పీ.వి. సింధు - మహిళల సింగిల్స్, టీమ్ ఈవెంట్స్
సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- పురుషుల డబుల్స్, టీమ్ ఈవెంట్స్
పుల్లెల గాయత్రి గోపీచంద్- మహిళల డబుల్స్, టీమ్ ఈవెంట్స్
కిడాంబి శ్రీకాంత్-పురుషుల టీమ్ ఈవెంట్స్
తరుణ్ మన్నేపల్లి- పురుషుల టీమ్ ఈవెంట్
ఆర్చరీ
వెన్నం జ్యోతి సురేఖ- కాంపౌండ్ సింగిల్స్, టీమ్ ఈవెంట్
ధిక్కరాజు (ధీరజ్) బొమ్మదేవర- రికర్వ్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్
తానిపర్తి చికిత -కాంపౌండ్ వ్యక్తిగత, మిక్స్డ్, టీమ్ ఈవెంట్
గణేష్ మణిరత్నం తిరుమూరు-కాంపౌండ్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్
షూటింగ్
ఇషా సింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ (సింగిల్స్ & టీమ్), 25మీ పిస్టల్
కైనాన్ షెనాయ్ ట్రాప్, మిక్స్డ్ స్కీట్
అథ్లెటిక్స్
జ్యోతి యర్రాజి-100 మీటర్ల హర్డిల్స్
మొగిలి వెంకట్రామ్ రెడ్డి-800 మీటర్ల పరుగు
క్రికెట్
తిలక్ వర్మ- పురుషుల టీ20 (వైస్ కెప్టెన్)
అరుంధతి రెడ్డి-మహిళల టీ20
శ్రీచరణి-మహిళల టీ20
టేబుల్ టెన్నిస్
ఆకుల శ్రీజ సింగిల్స్, డబుల్స్, టీమ్ ఈవెంట్
ఈ-స్పోర్ట్స్
సాయికృష్ణ నల్లూరి పోకీమాన్ యునైట్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


