Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: భారత అథ్లెట్‌కు విచిత్ర అనుభవం.. పురుష కోచ్‌తో కలిసి ఒకే రూమ్!

ఆసియా గేమ్స్ 2026 వసతి ఏర్పాట్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత బృందం అక్కడికి చేరినప్పటి నుంచి వసతి కోసం గంటల తరబడి వేచి చూడటంతో అథ్లెట్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. మహిళా జిమ్నాస్టిక్ ప్రణతి నాయక్‌కు అయితే వింత అనుభవం ఎదురైంది. తనకు తన కోచ్‌‌ అశోక్ మిశ్రాలకు కలిపి ఒకే రూమ్ కేటాయించడం విమర్శలకు దారి తీసింది.

Asian Games 2026: భారత్ శుభారంభం.. 5 ఓవర్లలోనే మ్యాచ్ ఖతమ్!

Asian Games 2026: భారత్ శుభారంభం.. 5 ఓవర్లలోనే మ్యాచ్ ఖతమ్!

క్రూయిజ్ షిప్‌లో ఇద్దరికీ ఒకే గదిని కేటాయించినట్లు నిర్వాహకులు భారత అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో మహిళ పురుషుడికి కలిపి ఒకే గదిని ఎలా ఇస్తారని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సమస్యను నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినా.. పరిష్కరించేందుకు గంటల తరబడి సమయం తీసుకున్నారని, భారత ఒలింపిక్ అసోసియేషన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి.

Asian Games 2026 Gymnast Pranati Nayak Given Same Room as Male Coach Amid Midnight Chaos in Japan

చివరకు సమస్య పరిష్కారమైనా.. అశోక్ మిశ్రాకు ఇబ్బందులు తప్పలేదని తెలుస్తోంది. తన రూమ్ తాళం కోసం వెళ్లినప్పుడు.. రిజిస్టర్‌లో పేరు నమోదు కాలేదని హోటల్ స్టాఫ్ అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. అధికారిక పత్రంలో అశోక్ మిశ్రా పేరులో ఐ సిస్టమ్ రికార్డ్స్‌లో మిస్ కావడంతో సమస్య ఎదురైనట్లు ఆసియా గేమ్స్ అధికారులు పేర్కొన్నారు.

దాంతో ఆ తప్పును సరిచేసి అతనికి అక్రిడేషన్ ఇచ్చేందుకు మరో 45 నిమిషాల సమయం పట్టింది. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ప్రణతి.. ఈ వార్తలను ధ్రువీకరించారు. ఇద్దరికీ కలిపి ఒకే రూమ్ కేటాయించారని, ఆ తర్వాత సమస్యను పరిష్కారించారని తెలిపింది. కానీ 2 గంటలు వేచిచూడాల్సి వచ్చిందని పేర్కొంది.

భారత్ నిరసన.. నఖ్వీ వ్యూహం!: ట్రోఫీ రచ్చ వెనుక అసలు రాజకీయం ఇదే!

Also Read

భారత్ నిరసన.. నఖ్వీ వ్యూహం!: ట్రోఫీ రచ్చ వెనుక అసలు రాజకీయం ఇదే!

ఆసియా గేమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా దేశాల జాతీయ జెండాలను ఆలస్యంగా ఆవిష్కరించారు. భారత్ తరఫున చెఫ్ ది మిషన్ సహదేవ్ యాదవ్, డిప్యూటీలు శరత్ కమల్, అలకనంద అశోక్, అంజలి భగవత్, డేవిడ్ తొట్టన్ పాల్గొన్నారు. ఇక ఆసియా గేమ్స్ పతాకధారులుగా మను బాకర్, తజీందర్ సింగ్ ముందుండి నడిపించారు.

Story first published: Friday, September 18, 2026, 16:56 [IST]
Other articles published on Sep 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+