Asian Para Games 2026: స్వర్ణం గెలిచిన నిషాద్ కుమార్!
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2026లో భారత్‌కు మరో స్వర్ణం వరించింది. పురుషుల లాంగ్ జంప్‌లో భారత ప్రముఖ పారా అథ్లెట్ నిషాద్ కుమార్ పసిడి సాధించి సరికొత్త చరిత్రను లిఖించాడు. అరంగేట్ర అంతర్జాతీయ ఈవెంట్‌లో 7.11 మీటర్ల దూరం దూకి అగ్రస్థానంలో నిలిచాడు. షూటింగ్‌లో మోనా అగర్వాల్ స్వర్ణం తర్వాత భారత్‌కు దక్కిన రెండో పసిడి పతకం ఇదే కావడం గమనార్హం.
పురుషుల టీ47 లాంగ్ జంప్ కేటగిరిలో పాల్గొన్న నిషాద్ కుమార్.. ఆరంభం నుంచే ఆధిపత్యం కనబర్చాడు. తొలి ప్రయత్నంలోనే 6.95 మీటర్ల దూరం దూకి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత తన ప్రయత్నాలను మరింత మెరుగ్గా మార్చి గరిష్టంగా 7.11 మీటర్లతో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఖజానోవ్ ఒమాట్‌బెక్ 6.99 మీటర్లతో సిల్వర్ మెడల్ సాధించగా.. శ్రీలంకకు చెందిన మహమ్మద్ సఫ్రాన్ బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు. ప్రత్యర్థులు నిషాద్ తొలి ప్రయత్నంలో దూకిన దూరాన్ని కూడా అందుకోలేకపోయారు.

ప్రస్తుతం ఆసియా హై జంప్ ఛాంపియన్ అయిన నిషాద్ కుమార్.. 2024 పారిస్ పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించాడు. గతేడాదే లాంగ్ జంప్‌కు మారిన నిషాద్ కుమార్.. యూఏఈలో కఠిన శిక్షణ తీసుకున్నాడు. దివ్యాంగుల పోటీల్లోనే కాకుండా.. సాధారణ శారీరక దృఢత్వం ఉన్న అథ్లెట్ల అథ్లెటిక్స్ పోటీల్లో కూడా నిషాద్ కుమార్ పాల్గొంటాడు. మస్కట్ వేదికగా జరిగిన జనరల్ అథ్లెటిక్స్ పోటీల్లో 7.22 మీటర్లు దూకి ఐదో స్థానంలో నిలిచాడు.
అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత షూటర్లు మోనా అగర్వాల్, అవని లేఖరా తొలి రెండు స్థానాల్లో నిలిచి బంగారు, వెండి పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ పతకాలతోనే ఈ టోర్నీలో భారత్ ఖాతా తెరిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


