Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Para Games 2026: చరిత్ర సృష్టించిన మోనా అగర్వాల్, అవని లేఖరా

ఆసియా పారా గేమ్స్‌ 2026లో భారత్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత షూటర్లు మోనా అగర్వాల్, అవని లేఖరా తొలి రెండు స్థానాల్లో నిలిచి బంగారు, వెండి పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ పతకాలతోనే ఈ టోర్నీలో భారత్ ఖాతా తెరిచింది.

IND vs NZ: వైభవ్ వాటర్ అందించాల్సిందే.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs NZ: వైభవ్ వాటర్ అందించాల్సిందే.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

ఏడో సిరీస్ తర్వాత 250 స్కోర్ సాధించిన మోనా అగర్వాల్ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించింది. ఈ క్రమంలో అవని లేఖరా పేరిట ఉన్న 249.6 ఆసియా పారా గేమ్స్ రికార్డును మోనా అగర్వాల్ అధిగమించింది. ఏడో సిరీస్ తర్వాత 249.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ పతకం సాధించింది.

Asian Para Games 2026 Mona Agarwal Avani Lekhara Secure Gold and Silver in Women s 10m Air Rifle

క్వాలిఫయింగ్ రౌండ్‌లో కూడా మోనా అగర్వాల్ 629.1 పాయింట్లతో చైనా షూటర్ జంగ్ చుయ్‌పింగ్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఈ క్రమంలో వరల్డ్ రికార్డ్(629.4)‌ను మోనా తృటిలో చేజార్చుకుంది. క్వాలిఫికేషన్ రౌంట్‌లో అవని లేఖరా 626.4 పాయింట్స్ సాధించింది.

చరిత్ర సృష్టించిన శీతల్ దేవి.. వరల్డ్ రికార్డు సమం, ఆసియా రికార్డు బ్రేక్!

Also Read

చరిత్ర సృష్టించిన శీతల్ దేవి.. వరల్డ్ రికార్డు సమం, ఆసియా రికార్డు బ్రేక్!

పురుషుల విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఫైనల్లో భారత్‌కు ఎలాంటి మెడల్ దక్కలేదు. మహానీర్ స్వరూప్ ఉన్హాల్కర్ (205.9) నాలుగో స్థానంలో నిలవగా.. అరంగేట్ర షూటర్ రాకేష్ నిడగుంది 141.5 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచాడు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో రాకేష్ (619.3), ఉన్హాల్కర్ (617.4) వరుసగా 7, 8 స్థానాల్లో నిలిచి ఫైనల్ చేరగా.. ఆనంద్ కృష్ణన్ 605.2 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.

Story first published: Monday, October 19, 2026, 12:12 [IST]
Other articles published on Oct 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+