Asian Games 2026: మీరాబాయి చానుకు రజతం.. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం!
ఆసియా గేమ్స్ 2026లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజత పతకం సాధించింది. మహిళల 49 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. బుధవారం జరిగిన ఈ పోటీల్లో మీరాబాయి చాను స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలు ఎత్తింది. మొత్తంగా 198 కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది.
ఉత్తర కొరియా వెయిట్ లిఫ్టర్ రి సాంగ్ గమ్.. రికార్డ్ స్థాయిలో 215 కేజీలు(స్నాచ్‌లో 94 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 121 కిలోలు) ఎత్తి బంగారు పతకం సాధించింది. ఇండోనేషియాకు చెందిన విజయన లులుక్ డియాని ట్రి మొత్తం 191 కిలోల బరువుతో కాంస్య పతకం సొంతం చేసుకుంది. స్నాచ్‌లో 87 కిలోల బరువెత్తిన లులుక్.. క్లీన్ అండ్ జర్క్‌లో 103 కిలోల బరువును ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

ఈ విజయంతో మీరాబాయి చాను సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన మీరాబాయి చాను.. ఆసియా గేమ్స్‌లో మాత్రం మెడల్ అందుకోలేకపోయింది. ఇన్నాళ్లు ఆమెను ఈ వెలితి వెంటాడింది. కానీ తాజా విజయంతో ఆ ముచ్చట తీరింది. అంతేకాకుండా ఆసియా గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు పతకం రావడం 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. 1998లో జరిగిన ఆసియా క్రీడల్లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించింది.
సాఫ్ట్ టెన్నిస్‌లో జై మీనా బ్రాండ్ మెడల్ సాధించి, ఈ క్రీడలో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. సెమీఫైనల్లో గాయపడటంతో అతను పోరాటాన్ని కొనసాగించలేకపోయినా.. కాంస్య పతకాన్ని అందుకున్నాడు.
షూటింగ్ రేంజ్‌లోనూ భారత్ పతకాలు సాధించింది. అనంత్‌జీత్ సింగ్ నరుకా, మైరాజ్ ఖాన్, భవ్‌తేఘ్ సింగ్ గిల్‌లతో కూడిన పురుషుల స్కీట్ టీమ్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అంతకుముందు మహిళల స్కీట్ జట్టు కూడా ఇదే విభాగంలో కాంస్యం సాధించింది. అయితే, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్‌కు నిరాశ ఎదురైంది. ఆమె పతకం లేకుండానే వెనుదిరిగింది. ప్రస్తుతం భారత్ ఒక స్వర్ణం, ఐదు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలతో పట్టికలో 11వ స్థానంలో కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


