Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs JPN: భారత్‌ విజయంపై వివాదం.. అంపైర్ యూటర్న్‌పై దుమారం! (వీడియో)

జపాన్‌తో జరిగిన ఏకైక టీ20లో భారత్ సాధించిన విజయంపై వివాదం నెలకొంది. టీమిండియా ఛీటింగ్ చేసి గెలిచిందనే వాదన వినిపిస్తోంది. ఆసియా గేమ్స్‌కు ముందు ఇరు దేశాల దౌత్య సంబంధానికి గుర్తుగా నిర్వహించిన ఈ మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో గెలిచింది.

మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించారు. అయితే జపాన్ ఇన్నింగ్స్ సందర్భంగా ఆఖరి ఓవర్‌లో అంపైర్ వైడ్‌గా ప్రకటించి.. తన నిర్ణయాన్ని మార్చుకోవడం వివాదాస్పదమైంది. భారత్ ఆటగాళ్లకు భయపడే అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అంపైర్ తన వైడ్ నిర్ణయానికి కట్టుబడి ఉండి ఉంటే జపాన్ గెలిచేదని కామెంట్ చేస్తున్నారు.

Asian Games 2026: మూడో రోజు ఒక స్వర్ణం.. మరో రెండు పతకాలు ఖాయం!

Asian Games 2026: మూడో రోజు ఒక స్వర్ణం.. మరో రెండు పతకాలు ఖాయం!

అసలేం జరిగిందంటే..?

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 5 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 32 పరుగులే చేసింది. శ్రేయస్ అయ్యర్(12 బంతుల్లో ఫోర్‌తో 16) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్(9), అభిషేక్ శర్మ(0), ఇషాన్ కిషన్(3) తీవ్రంగా నిరాశపర్చారు. జపాన్ బౌలర్లలో చార్లీ హరా-హింజ్2 వికెట్లు తీయగా.. ఇబ్రహీం తకాహషి, బెంజమిన్ ఇటో-డేవిస్ తలో వికెట్ తీసారు.

India vs Japan Wide Controversy Explained Can the Umpire Change His Decision Under ICC Laws

అనంతరం జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లకు 30 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టు కెప్టెన్ కెండెల్(12 బంతుల్లో ఫోర్‌తో 12) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(2/13) రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(0/7), రవి బిష్ణోయ్(0/10) కట్టడిగా బౌలింగ్ చేశారు.

ఆఖరి ఓవర్‌లో హైడ్రామా..

అక్షర్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్ మూడో బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. అయితే జపాన్ బ్యాటర్ అలెగ్జాండర్ షిరాయ్ ముందే స్టాన్స్ మార్చుకొని రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేశాడు. అయినా అంపైర్ వైడ్ ఇవ్వడంతో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌తో పాటు అక్షర్ పటేల్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. శ్రేయస్ అయ్యర్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.

చివరకు అంపైర్ లెగ్ అంపైర్‌తో చర్చించి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. లీగల్ డెలివరీగా ప్రకటించాడు. అయితే భారత ఆటగాళ్ల ఒత్తిడితో అంపైర్ నిర్ణయాన్ని మార్చుకోవడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ నిర్ణయం కారణంగా జపాన్ ఓటమిపాలైందని అభిప్రాయపడుతున్నారు. పసికూన జపాన్‌కు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు.

మేం గెలిచినా.. జపాన్ బాగా ఆడింది: శ్రేయస్ అయ్యర్

Also Read

మేం గెలిచినా.. జపాన్ బాగా ఆడింది: శ్రేయస్ అయ్యర్

అంపైర్ తప్పు లేదు..

ఐసీసీ రూల్స్ ప్రకారం.. తదుపరి బంతి వేయడానికి ముందే ఆన్-ఫీల్డ్ అంపైర్‌కు తన నిర్ణయాన్ని సవరించుకునే అధికారం ఉంది. ఈ మ్యాచ్‌కు టీవీ అంపైర్ లేకపోయినా.. లెగ్ అంపైర్‌తో చర్చించి తాను చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకున్నాడు. ఇది నిబంధనలకు లోబడే జరిగింది. కాబట్టి ఈ విషయంలో జపాన్‌కు ఎలాంటి అన్యాయం జరగలేదు.

పసికూనే అయినా వణికించింది..

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 5 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 32 పరుగులే చేసింది. శ్రేయస్ అయ్యర్(12 బంతుల్లో ఫోర్‌తో 16) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్(9), అభిషేక్ శర్మ(0), ఇషాన్ కిషన్(3) తీవ్రంగా నిరాశపర్చారు. జపాన్ బౌలర్లలో చార్లీ హరా-హింజ్2 వికెట్లు తీయగా.. ఇబ్రహీం తకాహషి, బెంజమిన్ ఇటో-డేవిస్ తలో వికెట్ తీసారు.

అనంతరం జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లకు 30 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టు కెప్టెన్ కెండెల్(12 బంతుల్లో ఫోర్‌తో 12) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(2/13) రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(0/7), రవి బిష్ణోయ్(0/10) కట్టడిగా బౌలింగ్ చేశారు.

Story first published: Tuesday, September 22, 2026, 20:50 [IST]
Other articles published on Sep 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+