Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs JPN: ఇషాన్ కిషన్ కళ్లు చెదిరే త్రో.. బిత్తరపోయిన జపాన్ బ్యాటర్!(వీడియో)

టీమిండియా స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. బౌండరీ లైన్ నుంచి అతను విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకింది. ఈ రనౌట్ చూసి అంపైర్లతో పాటు ఆటగాళ్లు బిత్తరపోయారు. ఇషాన్ కిషన్ కూడా నమ్మలేకపోయాడు.

మంగళవారం జపాన్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించగా.. భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే జపాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ కళ్లు చెదిరే రనౌట్‌తో ఆకట్టుకున్నాడు.

ఇషాన్ కిషన్ ఊచకోత.. 13 ఏళ్ల తర్వాత ఛాంపియన్‌గా ఈస్ట్ జోన్!

ఇషాన్ కిషన్ ఊచకోత.. 13 ఏళ్ల తర్వాత ఛాంపియన్‌గా ఈస్ట్ జోన్!

బౌండరీ లైన్ నుంచి..

అక్షర్ పటేల్ వేసిన తొలి ఓవర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని లాచ్లాన్ యమమోటో-లేక్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఆడి క్విక్ డబుల్‌కు ప్రయత్నించాడు. కానీ బౌండరీ లైన్ వద్ద బంతిని అందుకున్న ఇషాన్ కిషన్ పవర్ ఫుల్‌ త్రో సాయంతో నేరుగా స్టంప్స్‌‌ను పడేసాడు.

IND vs JPN Ishan Kishan Stunning Throw Dismisses Lachlan Yamamoto-Lake Video Goes Viral

క్రాస్ట్ స్టంప్స్‌ను పడేయడం హైలైట్. గిల్ పూర్తి చేసుకున్నా.. లాచ్లాన్ డబుల్ తీసే ప్రయత్నంలో డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. బౌండరీ లైన్ నుంచి ఇషాన్ కిషన్ విసిరిన పవర్ ‌ఫుల్ త్రో‌కు లాచ్లాన్ బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


గట్టెక్కిన భారత్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 32 పరుగులే చేసింది. శ్రేయస్ అయ్యర్(12 బంతుల్లో ఫోర్‌తో 16) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్(9), అభిషేక్ శర్మ(0), ఇషాన్ కిషన్(3) తీవ్రంగా నిరాశపర్చారు. జపాన్ బౌలర్లలో చార్లీ హరా-హింజ్2 వికెట్లు తీయగా.. ఇబ్రహీం తకాహషి, బెంజమిన్ ఇటో-డేవిస్ తలో వికెట్ తీసారు.

నక్కతోక తొక్కిన ఇషాన్ కిషన్.. పట్టిందల్లా బంగారమే!

Also Read

నక్కతోక తొక్కిన ఇషాన్ కిషన్.. పట్టిందల్లా బంగారమే!

అనంతరం జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లకు 30 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టు కెప్టెన్ కెండెల్(12 బంతుల్లో ఫోర్‌తో 12) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(2/13) రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(0/7), రవి బిష్ణోయ్(0/10) కట్టడిగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌ ఫ్యాన్ కోడ్‌లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో చాలా మంది అభిమానులు చూడలేకపోయారు. దాంతో ఈ మ్యాచ్ హైలైట్స్‌ను యూట్యూబ్‌లో పెట్టగా.. భారీ సంఖ్యలో వ్యూస్ నమోదయ్యాయి.

Story first published: Tuesday, September 22, 2026, 22:41 [IST]
Other articles published on Sep 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+