Neeraj Yadav: పారా గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య!
భారత పారా అథ్లెట్, పారా ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంట్లో విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు బుధవారం మీడియాకు తెలిపారు. నీరజ్ యాదవ్ మృతిని భారత పారా అథ్లెటిక్స్ టీమ్ కోచ్ సత్యనారాయణ కూడా ధ్రువీకరించారు. శారీరకంగా వైకల్యం ఉన్నా.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన నీరజ్ యాదవ్ ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ విస్మయానికి గురి చేసింది.
నీరజ్ యాదవ్ జావెలిన్ త్రో ఎఫ్ 55 కేటగీరిలో పోటీపడేవాడు. 2018 పారా ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్, 2023 జావెలిన్ త్రోతో పాటు డిస్కస్ త్రో విభాగాల్లో స్వర్ణాలు సాధించాడు. అయితే డోపింగ్ టెస్ట్‌లో విఫలం కావడంతో జపాన్ పారా ఆసియా గేమ్స్ 2026కు అర్హత సాధించలేకపోయాడు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతను.. మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఏడేళ్ల వయసులో పోస్ట్ పోలియో రెసిడ్యుయల్ పెరాలిసిస్ కారణంగా వీల్ ఛైర్‌కే పరిమితమైన అతను.. ముందుగా వీల్‌ఛైర్ టెన్నిస్ ఆడేవాడు. ఆ తర్వాత పారా అథ్లెటిక్స్‌కు మారాడు. అంతర్జాతీయ వేదికపై అద్భుతాలు సృష్టించాడు. జావెలిన్, డిస్కస్ త్రోతో పాటు షాట్‌పుట్‌లోనూ భారత్‌కు పలు పతకాలను అందించాడు.
నీరజ్ మరణానికి పారా ఆసియా గేమ్స్ ఆడకపోవడమే కారణమని చెప్పలేమని కోచ్ సత్యనారాయణ అన్నాడు. అతని మరణ వార్త తీవ్రంగా బాధించిందని, అతను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో తెలియదని చెప్పాడు. క్రీడాకారుల జీవితాల్లో ఒడిదొడుకులు సర్వసాధారణమని, నీరజ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని చెప్పుకొచ్చాడు.
ఆసియా పారా గేమ్స్‌లో 3 స్వర్ణాలు..
2018లో ఇండోనేషియాలోని జకార్తా వేదికగా జరిగిన పురుషుల F55 జావెలెన్ త్రో విభాగంలో 29.84 మీటర్ల దూరంతో ఆసియా రికార్డు నమోదు చేసిన నీరజ్ యాదవ్ స్వర్ణ పతకం సాధించాడు.
2023లో చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో జావెలెన్ త్రో F55, డిస్కస్ త్రో F54/55/56 విభాగాల్లో నీరజ్ యాదవ్ రెండు స్వర్ణ పతకాలను అందుకున్నాడు.
మొరాకో వేదికగా జరిగిన 2022 పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్‌లో పసిడి పతకం సాధించాడు.
దుబాయ్ వేదికగా జరిగిన 2016 ఫజ్జా గ్రాండ్ ప్రిక్స్‌లో F55 షాట్‌పుట్, డిస్కస్ త్రో విభాగాల్లో రెండు సిల్వర్ పతకాలు గెలుచుకున్నాడు.
2015 ఢిల్లీ స్టేట్ అథ్లెటిక్స్ మీట్‌లో షాట్‌పుట్, జావెలెన్ త్రో, డిస్కస్ త్రో విభాగాల్లోనూ మూడు స్వర్ణ పతకాలు సాధించి యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


