Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: వైభవ్ సూర్యవంశీపై వేటు.. న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

న్యూజిలాండ్ గడ్డపై వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శుక్రవారం అక్లాండ్ వేదికగా జరగనున్న నాలుగో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న భారత్ క్లీన్ స్వీప్‌పై కన్నేసింది.

మరోవైపు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన న్యూజిలాండ్.. కనీసం చివరి రెండు మ్యాచ్‌లైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. మూడో టీ20లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఏకపక్ష విజయాన్ని అందుకుంది. అయితే నాలుగో టీ20కి టీమిండియా కాంబినేషన్‌లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది.

IND vs NZ: ఆ ఇద్దరితో పాటు మంచు ముంచింది: మిచెల్ సాంట్నర్

IND vs NZ: ఆ ఇద్దరితో పాటు మంచు ముంచింది: మిచెల్ సాంట్నర్

వైభవ్‌పై వేటు..

గజ్జలో గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్.. నాలుగో టీ20తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే వైభవ్ సూర్యవంశీపై వేటు పడుతుంది. ఇషాన్ కిషన్ గైర్హాజరీలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. మూడో టీ20లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు.. అభిషేక్ శర్మతో కలిసి భీభత్సం సృష్టించాడు. కానీ ఇషాన్ కిషన్ రీఎంట్రీతో అతను తుది జట్టు నుంచి తప్పుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది.

India Playing XI vs New Zealand For 4th T20I Ishan Kishan In and Vaibhav Sooryavanshi Out

సిరీస్ గెలిచిన నేపథ్యంలో వైభవ్‌ను ఆడించాలనుకుంటే సంజూ శాంసన్‌కు రెస్ట్ ఇవ్వవచ్చు. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి మిడిలార్డర్‌లో ఆడనుండగా.. భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఈ మ్యాచ్‌కు కూడా టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే ఆడే అవకాశం ఉంది.

IND vs NZ: వారి సహకారంతోనే ఈ విధ్వంసకర సెంచరీ: అభిషేక్ శర్మ

Also Read

IND vs NZ: వారి సహకారంతోనే ఈ విధ్వంసకర సెంచరీ: అభిషేక్ శర్మ

న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 ఆడే భారత జట్టు ఇదే

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ/ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.

భారత టీ20 టీమ్

శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్.

Story first published: Wednesday, October 28, 2026, 14:16 [IST]
Other articles published on Oct 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+